365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 8,2023: ఉత్తర భారత దేశంలో చలిగాలులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఐదు రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేయవలసి వచ్చింది. అవి ఏయే రాష్ట్రాలు..? ఎప్పుటివరకు మూసేశారో తెలుసా..?
చలిగాలులు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానాలో చలిగాలులు వీస్తున్నాయి.
ఎముకలు కొరికే చలికా కారణంగా చిన్నారులు బడికి వెళ్లడం కష్టంగా మారింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు వచ్చే వారం పాటు మూసివేయనున్నారు.
పెరుగుతున్న చలి కారణంగా, ఢిల్లీలో చలి, పొగమంచు, చలిగాలుల ప్రభావంతో అక్కడి ప్రభుత్వం జనవరి 1వతేదీ నుంచి 15తేదీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.
బీహార్: 10వ తరగతి వరకు పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయనున్నా రు. విపరీతమైన చలి కారణంగా బీహార్ రాజధాని పాట్నాలో పాఠశాలలు మూసివేస్తున్నారు.
10వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 14, 2023 వరకు పాట్నా పాఠశాలలు మూసివేయనున్నారు. జనవరి 7న పాఠశాలను మూసివేయాలంటూ పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
గయలో కూడా పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్: లక్నో, నోయిడా, ఘజియాబాద్ సహా పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. చలిగాలుల కారణంగా, రాజధాని లక్నోలోని పాఠశాలలు జనవరి 14, 2023 వరకు మూసివేయనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, నోయిడా, ఘజియాబాద్‌తో సహా వివిధ జిల్లాల్లో పాఠశాలల మూసివేత గురించి జిల్లా యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
లక్నోలో జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, లక్నోలోని అన్ని పాఠశాలలు ఒకటి నుంచి 8వతరగతుల వరకు, జనవరి 9 నుంచి జనవరి 14వతేదీ వరకు మూసివేయనున్నారు.
పంజాబ్: పాఠశాలలకు శీతాకాల సెలవులను మళ్లీ పొడిగించారు కఠినమైన శీతాకాలం దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
జనవరి 9న పాఠశాలను ప్రారంభిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి జనవరి 14వరకు సమీక్షలు ఉన్నాయని పాఠశాల విద్యా మంత్రి పంజాబ్ హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 7వ తరగతుల విద్యార్థులకు మాత్రమే సెలవులు పొడిగించారు.
జనవరి 9 నుంచి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 8నుంచి 11తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.
రాజస్థాన్: అనేక జిల్లాల్లో 8వ తరగతి వరకు పాఠశాలలు మూతపడ్డాయి. చలిగాలుల కారణంగా, జైపూర్, బికనీర్‌తో సహా రాజస్థాన్‌లోని అనేక జిల్లాల్లోని పాఠశాలలను జనవరి 14వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కోటా, బరన్ జిల్లాల్లోనూ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతాలలో చలిగాలులు వ్యాపించడంతో బికనీర్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్: భోపాల్, ఇండోర్, విదిషా, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు 8తరగతి వరకు జనవరి 10 వరకు మూసివేయనున్నారు.
నివేదిక ప్రకారం, స్థానిక పరిపాలన ఆదేశాల మేరకు భోపాల్, ఇండోర్, విదిషా , ఉజ్జయినితో సహా కొన్ని జిల్లాల్లో ప్రాథమిక ప్రాథమిక తరగతుల వరకు అంటే 8వతరగతి వరకు పాఠశాలలు మూసివేయనున్నారు.