-ఎస్సీ అజ్మానీ, జనరల్ ఫిజిషియన్
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,జూన్ 27, 2021: మీరెప్పుడైనా ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు అక్కడ వారి టాయ్ లెట్ ఉపయోగించుకోవాల్సి వచ్చినప్పుడు టాయ్ లెట్ సీట్ పై భయంకరమైన హార్డ్ వాటర్ స్టెయిన్స్ (నీటి మరకలు) చూసి భయపడ్డారా ? మన ఇళ్ల లో టాయ్ లెట్స్ క్రిములు వృద్ధి చెందేందుకు అనువైన ప్రాంతంగా ఉంటాయి. అన్ని విషయాలూ అందరికీ తె లిసి ఉండాలనుకోలేం, కాకపోతే టాయ్ లెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రం అందరికీ తెలిసి ఉండా లి. టాయ్ లెట్ స్టెయిన్స్, దుర్వాసనలకు సంబంధించిన అసలు విషయాలను సులభంగా అర్థం చేసుకోవడం ఎలాగోతెలుసుకుందాం.
నీటి మరకల సమస్యను పరిష్కరించేందుకు ఓ విధానం. టాయ్ లెట్ సీట్ ఉపరితలాన్ని హైడ్రోఫోబిక్ గా లేదా యాంటీ స్టిక్ గా చేసే ఉత్పాదనను వినియోగించడం. అలా చేయడం వల్ల నీళ్లు ఉపరితలానికి అంటుకో కుండా ఉంటాయి. అది మరకలు ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. డొమెక్స్ లాంటి టాయ్ లెట్ క్లీనింగ్ ఉత్పాదనలు ఫ్రెష్ గార్డ్ గా వ్యవహరించే వినూత్నతను కలిగిఉంటాయి. ఈ సాంకేతికత టాయ్ లెట్ ఉపరితలానికి అతుక్కొని దాన్ని హైడ్రోఫోబిక్ గా మారుస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి కఠిన జల లవణాలను కలిగిఉండే నీటిని ఇది తొలగిస్తుంది. ఆ లవణాలు టాయ్ లెట్ ఉపరితలంపై ఎండిపోకుండా చేస్తుంది. తద్వారా టాయ్ లెట్ ఉపరితలంపై లైమ్ స్కేల్ ఏర్పడకుండా చూస్తుంది.
టాయ్ లెట్ లో మరకల సంగతేంటి ?
లైమ్ స్కేల్, హార్డ్ వాటర్ పేరుకుపోవడం, హార్డ్ వాటర్ స్టెయిన్స్ లాంటివి ఫాసెట్స్, వాటర్ నాజిల్స్ చుట్టూరా మరకలను ఏర్పరుస్తాయి. నీటిలో పరిమితికి మించి కాల్షియం, మెగ్నీషయం వంటివి ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఫాసెట్స్, షవర్స్, సింక్ లు, టాయ్ లెట్స్ లాంటి వాటిపై కొంతకాలానికి హార్డ్ వాటర్ (కఠిన జలం) వేగంగా పేరుకుపోయి తుప్పు, మరకలు లాంటి వాటిని మిగులుస్తుంది. అవి చూసేందుకు భయంకరంగా ఉండడం మాత్రమే గాకుండా వాటిని తొలగించడం కూడా కష్టం. నీరు నిరంతరం నిలిచిఉండే టాయ్ లెట్స్ లో ఇవి మరింత సమస్యాత్మకంగా తయారవుతాయి.
హార్డ్ వాటర్ వెనుక కారణాలు
హైడ్రోఫోబిక్ సర్ ఫేస్ అంటే….అది స్వాభావికంగా నీటి వికర్షకంగా ఉంటుంది. తడిగాకుండా ఉంటుంది. నీ రు పడడం అనేది 90 డిగ్రీల కోణాన్ని మించినప్పుడు మాయిశ్చర్ కలిగిఉండే టచ్ పాయింట్స్ ఓ ఉపరిత లం హైడ్రోపోబిక్ లేదా యాంటీ స్టిక్ గా ఉన్నదో లేదో నిర్ణయిస్తాయి. ఇక హైడ్రోఫోబిక్ ఉపరితలాలు నీటిని పట్టి ఉంచుకుంటాయి, దాంతో ఉపరితలాలు తడిగా ఉంటాయి. అవి డ్రాప్ లెట్ టచింగ్ పాయింట్ యాంగిల్ ను 90 డిగ్రీల కంటే తక్కువగా కలిగిఉంటాయి. అంటే ఈ ఉపరితలాలపై నీళ్లు మరింత కాలం నిలబడుతుంది, అది లవణాలు పేరుకుపోయేందుకు, మరకలు ఏర్పడేందుకు దారి తీస్తుంది.
చిట్కాలు పాటించిన తరువాత కూడా హార్డ్ వాటర్ స్టెయిన్స్ నిరోధించేందుకు ఏం చేయాలి ?
మనకెన్నో చిట్కాలున్నాయి. బేకింగ్ సొడా, వెనిగర్ మిశ్రమం, బొరాక్స్, వెనిగర్ పేస్ట్ లాంటివి వీటిలో కొన్ని. అంతకన్నా ముందుగా ఇలా మరకలు పడేందుకు కారణాలేంటో అర్థం చేసుకోవడం ముఖ్యం.ఫ్లషింగ్ తరువాత కూడా టాయ్ లెట్ ఉపరితలం పై మిగిలిఉండే నీటి కారణంగా లైమ్ స్కేల్, సాయిల్, మైక్రొమియల్ ఫిల్మ్, దుర్వాసన అనేవి ఏర్పడుతాయి. ఈ నీళ్లు లైమ్ స్కేల్ పేరుకుపోయేందుకు దారి తీస్తుంది. పేరుకుపోయే నీళ్లు సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమై, దుర్వాసన వచ్చేలా చేస్తాయి. నీరు పేరుకుపోకుండా చేయడం లేదా నీటి పొరను మిగల్చకుండా నీరు వేగం గా పోయేలా చేయడం ద్వారా టాయ్ లెట్ ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.