Tue. Dec 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మే 23,2022: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా సోమ‌వారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.

ఉద‌యం 8.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి క్షీరాధివాసం నిర్వ‌హించారు. శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య పాల‌తో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయ‌డం వ‌ల‌న విగ్ర‌హంలో ఎలాంటి దోషాలు ఉన్న తొల‌గి పోతాయ‌ని అర్చ‌కులు తెలిపారు. త‌రువాత కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు చేపట్టారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

error: Content is protected !!