PAVITRA SAMARPANA HELD AT SRI KRT PAVITRA SAMARPANA HELD AT SRI KRT

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగ‌స్టు 5,2021:తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది.

Scientifically consecrated in Sri Kodandaramalayam
Scientifically consecrated in Sri Kodandaramalayam

ఇందులో భాగంగా ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వేడుక‌గా స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

Scientifically consecrated in Sri Kodandaramalayam
Scientifically consecrated in Sri Kodandaramalayam

సాయంత్రం శ్రీ భాష్య‌కార్ల స‌న్నిధిలో ఆస్థానం అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు చేపడతారు.