365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,15 డిసెంబర్‌ 2021: ప్రపంచంలో సుప్రసిద్ధ కోడింగ్‌ పోటీ,ఎస్సెస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఐకోడ్‌, జనవరి  2021లో  ఐకోడ్‌ గ్లోబల్‌ హ్యాకథాన్‌  తమ భారతీయ విభాగపు పోటీలను ప్రారంభింది.ఈ కార్యక్రమానికి గత మూడు సంవత్సరాలుగా 22 దేశాలలోని పాఠశాలలు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనను అనుసరించి  ఐకోడ్‌, ఇప్పటికే ప్రాధమిక  స్ధాయి ఎంపిక పోటీల కోసం 40వేల దరఖాస్తులను భారతదేశపు పోటీల కోసం అందుకుంది. ఈ విద్యార్థులు బహుళ అంచెల  పోటీలలో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో  తొలి దశ ఎంపిక పోటీలు ఆగస్టు 2021లో జరుగగా, అక్కడ నుంచి జోనల్‌, నేషనల్‌ ఆ తరువాత దక్షిణాసియా పోటీలు  నవంబర్‌ 2021లో జరిగాయి. అంతర్జాతీయంగా ఈ హ్యాకథాన్‌లో రెండు మిలియన్లకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోటీలో మొత్తంమ్మీద 57 మంది భారతీయ విద్యార్థులు అసాధారణ నైపుణ్యం కనబరిచి ఐ కోడ్‌ గ్లోబల్‌ హ్యాకథాన్‌ అంతర్జాతీయ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ ఫైనల్‌ పోటీలు 12 డిసెంబర్‌ 2021 న జరిగాయి. ఎంపికైన భారతీయ  విద్యార్థులు యుఎస్‌ఏ, ఇజ్రాయిల్‌, చైనా, సింగపూర్‌, యుఏఈ  లాంటి పలు దేశాలకు చెందిన విద్యార్థులతో పోటీపడ్డారు. అంతర్జాతీయ ఫైనల్‌లో 10 మంది భారతీయ విద్యార్థులు టాప్‌ 50లో నిలిచారు.

ప్రతి దశ పోటీలోనూ హ్యాకథాన్‌ను 60 నిమిషాల పోటీగా తీర్చిదిద్దారు. అనుకూల , గేమిఫైడ్‌ కోడింగ్‌ పోటీని 6 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థుల కోసం వారి వయసుకు  తగిన రీతిలో తీర్చిదిద్దారు. ఈ మాడ్యుల్స్‌లో బిగినర్‌, అడ్వాన్స్‌డ్‌ లెవల్స్‌ బ్లాక్‌ కోడింగ్‌ను ప్రైమరీ విద్యార్థులకు ,బిగినర్స్‌కు ,అడ్వాన్స్‌ స్ధాయి  పైథాన్‌ను మిడిల్‌,హై స్కూల్‌ విద్యార్థులకు ఉంది.

భారతదేశంలో నిర్వహించిన  హ్యాకథాన్‌లో కనిపించిన అసాధారణ అంశం ఏమిటంటే టియర్‌ 2, టియర్‌ 3 నగరాల నుంచి అత్యధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొనడంతో పాటుగా అసాధారణ ప్రతిభాపాటవాలనూ చూపారు. దేశం నుంచి ఎంపికైన ఫైనలిస్ట్‌లలో 75% వారే ఉన్నారు. తెలంగాణాలోని సికింద్రాబాద్‌కు చెందిన బోల్టన్‌ స్కూల్‌ , భారతదేశం నుంచి ఎంపికైన ఫైనలిస్ట్‌ స్కూల్స్‌లో ఒకటి.

ఈ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీమతి డీ జానకి మాట్లాడుతూ ‘‘ ఐకోడ్‌   హ్యాకథాన్‌ టీమ్‌ లక్ష్యం, విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించేలా చేయడం. తద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రతిభావంతులను వెలికి తీసుకురావడం. ఈ పోటీలో అసాధారణ ప్రతిభాపాటవాలు చాటిన మా విద్యార్థుల పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ విద్యార్థులకు చక్కటి మార్గ నిర్దేశనం చేసిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు’’ అని అన్నారు.

శ్రీ అసఫ్‌ రోథ్‌చైల్డ్‌,హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పార్టనర్‌షిప్స్‌, ఐకోడ్‌ ఫౌండేషన్‌ మాట్లాడుతూ  ‘‘ భారతదేశం నుంచి వచ్చిన స్పందన, చూపిన ప్రతిభ పట్ల ఐకోడ్‌ వద్ద  మాకు ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. అంతర్జాతీయంగా అత్యంత తెలివైన విద్యార్థులలో భారతీయ విద్యార్థులు ముందు వరుసలో ఉంటారు. భారతదేశం నుంచి ఎంపికైన ఫైనలిస్ట్‌లు , నూతన విద్యా విధానం ద్వారా రాబోయే సంవత్సరాలలో అసాధారణంగా వృద్ధి చెందనున్నారు. తమ విద్యావిధానంలో కంప్యూటేషనల్‌ థింకింగ్‌ ఫౌండేషన్‌ నైపుణ్యాలను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించిన భారతదేశంలోని నాయకులు, విధాన నిర్ణేతలను నేను అభినందిస్తున్నాను’’ అని అన్నారు