Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 3,2023:భారత స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. గాంధీ జయంతి తర్వాతి రోజూ పతనం తప్పలేదు. క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

ఆటో, ఆయిల్‌, ఫార్మా రంగాల షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109 పాయింట్లు, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 316 పాయింట్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలహీనపడి 83.21 వద్ద స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కీలకంగా మారాయి.

క్రితం సెషన్లో 65,828 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,813 వద్ద మొదలైంది. 65,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,813 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిసింది.

శుక్రవారం 19,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,622 వద్ద ఓపెనైంది. 19,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 109 పాయింట్లు తగ్గి 19,528 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 185 పాయింట్ల నష్టంతో 44,399 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 13:17గా ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌ (2.00%), ఎల్‌టీ (1.67%), టైటాన్‌ (1.34%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (1.33%), అదానీ పోర్ట్స్‌ (0.79%) టాప్‌ గెయినర్స్‌. ఓఎన్‌జీసీ (3.78%), ఐచర్‌ మోటార్స్‌ (2.68%), మారుతీ (2.67%), హిందాల్కో (2.50%), డాక్టర్‌ రెడ్డీస్‌ (2.31%) టాప్‌ లాసర్స్‌.

మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి. ఎనర్జీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు తగ్గాయి.

నిఫ్టీ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు కీలకంగా నిలిచాయి. అయితే బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌టీ కొంతమేర ఆదుకున్నాయి.

కాగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు స్వల్పంగా పెరిగాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌ అక్టోబర్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,640 వద్ద రెసిస్టెన్సీ, 19,550 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఎస్బీఐ, మహానగర్ గ్యాస్‌, పీఎన్బీ హౌజింగ్‌, మోతీలాల్‌ ఫైనాన్స్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

మెగా విలీనం తర్వాత హెచ్‌డీఎఫీ బ్యాంకు అగ్రశ్రేణి నాయకత్వంలో మార్పులు చేసిందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. జేకే సిమెంట్‌ అనుజ్‌ ఖండేల్‌వాల్‌ను గ్రే సిమెంట్స్‌ బిజినెస్‌ హెడ్‌గా నియమించింది. మెట్రోబ్రాండ్స్‌ షేర్లు ఇంట్రాడేలో 14 శాతం మేర ఎగిశాయి.

ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, బేయర్స్‌ కార్ప్‌సైన్స్‌, సీఎస్‌బీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, జ్యోతీ ల్యాబ్స్‌, కేఫిన్‌ టెక్నాలజీస్‌, సీఈ ఇన్ఫో, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, యూనియన్‌ బ్యాంక్‌, జొమాటో షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని చేరుకున్నాయి.

ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌ విధానంలో 0.99 శాతం వాటా విక్రయించారు. మహానగర్‌ గ్యాస్‌కు జెఫరీస్‌ బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!