Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 26,2024 : పెళ్లి ఆహ్వాన పత్రికను తిరుమలతిరుపతి వేంకటేశ్వర స్వామివారికి పంపండి.. స్వామి వారి ఆశీర్వచనాలతోపాటు ప్రత్యేక పెళ్లి కానుక పొందండి.. తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)వారికి మొదటి పెళ్లి శుభలేఖను స్వామివారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపితే.. వారు వెంటనే తిరుమల నుంచి మీకు స్వామివారి నుంచి నవ దంపతులకు విశిష్టమైన కానుక అందజేస్తారు.

ఈ కానుకలో వధూవరుల చేతికి కట్టడానికి కంకణాలు, పెళ్లి రోజున తలంబ్రాలలో కలపడానికి అక్షతలు, వివాహ వైశిష్ట్యం గురించి వివరించే పుస్తకం, కుంకుమ, స్వామివారి మహా ప్రసాదం, తదితర వస్తువులు ఉంటాయి. ఈ బహుమతి, శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీర్వచనాలతో అందజేస్తారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నుంచి బహుమతి పొందినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన పత్రిక ఈ కింద ఇచ్చిన చిరునామాకు కొరియర్ ద్వారా పంపించవచ్చు. శుభలేఖపై ఉన్న చిరునామా ఆధారంగా, స్వామివారి కానుకను మీకు అందిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కాబోయే వధూవరులు అందుకొని స్వామివారి ఆశీర్వచనాలు, టీటీడీ వారు అందించే ప్రత్యేక కానుకను పొందండి..

చిరునామా:
To,
Sri Lord Venkateswara Swamy,
The Executive Officer,
Tirumala Tirupati Devasthanams (TTD)
TTD Administrative Building
K.T. Road
Tirupati – 517501.

error: Content is protected !!