365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,జనవరి 22,2026: ఆడియో టెక్నాలజీ దిగ్గజం సెన్హైజర్ (Sennheiser), 2026 రిపబ్లిక్ డే సందర్భంగా సంగీత ప్రియులకు,కంటెంట్ క్రియేటర్లకు తీపి కబురు అందించింది. అమెజాన్‌లో ప్రారంభం కానున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా తన ప్రీమియం హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్,మైక్రోఫోన్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది.
ఈ ప్రత్యేక సేల్ జనవరి 16 నుంచి అందరికీ అందుబాటులోకి రాగా, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 15 అర్ధరాత్రి నుండే ముందస్తు యాక్సెస్ లభిస్తుంది.
ఇదీ చదవండి..ఎన్ఐఐటి యూనివర్సిటీ: 2026 విద్యా సంవత్సరానికి స్కాలర్ సెర్చ్ ప్రోగ్రామ్ ప్రారంభం..
ఇదీ చదవండి..హైదరాబాద్‌లో చిన్మయ మిషన్ అమృత మహోత్సవ వేడుకలు..
ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు,EMI సౌకర్యం
వినియోగదారులు సెన్హైజర్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలతో పాటు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపులను పొందవచ్చు. దీనికి తోడు 24 నెలల వరకు ‘నో కాస్ట్ ఈఎంఐ’ (No Cost EMI) సౌకర్యాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది.
Read this also..Hyderabad to Witness Mass Gita Chanting by 50,000 at Chinmaya Mission’s Amrit Mahotsav..
Read this also..Shiv Nadar University Chennai Opens UG Admissions for 2026..
ఆఫర్లో ఉన్న ప్రధాన ఉత్పత్తులు – ధరల వివరాలు:
- క్రియేటర్ల కోసం సెన్హైజర్ ప్రొఫైల్ వైర్లెస్: వీడియోగ్రాఫర్లు,క్రియేటర్ల కోసం రూపొందించిన ఈ టూ-ఛానల్ మైక్రోఫోన్ సిస్టమ్ ఇప్పుడు రూ. 21,990 కే లభ్యం కానుంది. ఇది అల్ట్రా-పోర్టబుల్ ఛార్జింగ్ బార్,ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీతో వస్తుంది.
- మొమెంటమ్ 4 వైర్లెస్ (MOMENTUM 4 Wireless): 42 mm ట్రాన్స్డ్యూసర్లు, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ,60 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఈ ఫ్లాగ్షిప్ హెడ్‌ఫోన్స్ ధర రూ. 23,990. కొనుగోలుదారులకు BTD 600 బ్లూటూత్ డాంగిల్ ఉచితంగా లభిస్తుంది.
- హెచ్డి 630 వైర్లెస్ (HD 630 Wireless): హై-రెస్ ఆడియో ,60 గంటల ప్లేబ్యాక్ అందించే ఈ ప్రీమియం హెడ్‌ఫోన్స్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 44,990 ధరకు అందుబాటులో ఉన్నాయి.
- మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 4 (MOMENTUM True Wireless 4): అత్యాధునిక 24-బిట్ ఆడియో,నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్ ధర రూ. 18,990. వీటితో పాటు కూడా BTD 600 డాంగిల్ ఉచితంగా పొందవచ్చు.
- ప్రొఫెషనల్ మైక్రోఫోన్లు:

సెన్హైజర్ ఎమ్‌డి 421 కాంపాక్ట్: స్టూడియో ,లైవ్ రికార్డింగ్‌లకు ఉత్తమమైన ఈ మైక్రోఫోన్ ధర రూ. 20,990.
న్యూమాన్ టిఎల్ఎమ్ 102 (Neumann TLM 102): జర్మన్ ఇంజనీరింగ్‌తో రూపొందిన ఈ స్టూడియో-క్వాలిటీ మైక్రోఫోన్ సేల్‌లో రూ. 56,990 కే లభిస్తుంది.
