Thu. Nov 7th, 2024
today-share-markets

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మార్చి 31,2023: ఇటీవల కాలంలో పెరుగుతూ,తగ్గుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు కొద్దీ రోజుల నుంచి కాస్త ఊపందుకుంటున్నాయి. ఈరోజు ప్రారంభ సెషన్ లో మార్కెట్ సూచీలు జోరందుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి.

today-share-markets

షేర్ మార్కెట్: దేశీయ స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించడంతో సెన్సెక్స్ 705 పాయింట్లు, నిఫ్టీ కూడా జోరందుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజున ప్రారంభ లాభాలను చవిచూసింది. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం సెన్సెక్స్ 705.26 పాయింట్లు లాభపడింది. 58,665.35 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 196.95 పాయింట్ల లాభంతో 17,277.65 వద్ద ట్రేడవుతోంది.

error: Content is protected !!