Severe-earthquake

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,నవంబర్ 9,2022: బుధవారం తెల్లవారుజామున దిగువ హిమాలయ ప్రాంతంలో 6.3-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో ఆరుగురు మృతిచెందారు. ఇక్కడ తీవ్రంగా భూకంపమ్ సంభవించడంతో ఉత్తర భారతదేశం నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలలో ఢిల్లీ, నోయిడ, గుడ్ గావ్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నిద్ర లేచి భయభ్రాంతులకు గురయ్యారు.

Severe-earthquake

తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పితోర్‌ఘర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో ఉందని ఎన్‌సిఎస్ తెలిపింది. ఐదు గంటల వ్యవధిలోనే నేపాల్లో రెండుసార్లు భూమి కంపించింది.