Thu. Dec 12th, 2024
sugar patients

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 25, 2022: లైంగిక జీవితంపై ఆసక్తి కోల్పోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2020 ప్రారంభం నుంచి కనీసం10 శాతం పెరిగిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. దేశంలో కొవిడ్ -19 మహమ్మారి తర్వాత లాక్‌డౌన్ వ‌ల్ల ప్రజల జీవనశైలి మార్పుల కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి దారితీసింది. అంతేకాదు దీని కారణంగా పురుషులు, మహిళల లైంగిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోంది.

మ‌ధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి, ఇది పాశ్చాత్య దేశాల వారి కంటే చాలా వేగంగా భారత జనాభాను ప్రభావితం చేస్తుంది. దీనివ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గ‌డంతో పాటు.. ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇది ప్ర‌జ‌ల జీవన నాణ్యతను తగ్గించడానికి కార‌ణ‌మవుతోంది. మ‌ధుమేహం దుష్ప్ర‌భావాల్లో త‌క్కువ‌గా తెలిసిన‌వాటిలో ఇదొక‌టి. పురుషుల్లో అంగస్తంభన లోపం సాధారణ జనాభా కంటే మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ అవుతున్నట్లు ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. దీనివ‌ల్ల శారీరక సంక్లిష్టతల నుంచి మానసిక అసమతుల్యత వరకు జీవితంలోని ప‌లు అంశాల్లో ప్రభావం ప‌డుతుంది.

Etihad-Airways

దేశంలో 2045 నాటికి 145 మిలియన్ల మంది షుగర్ పేషంట్స్..

2045 నాటికి భారతదేశంలో 145 మిలియన్ల మంది మధుమేహంబారీన పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ లు, మూత్రపిండాల వైఫల్యం, అంధత్వం, కొన్ని సందర్భాల్లో చేతులు, కాళ్ల‌ను తీసేయాల్సి రావ‌డానికి కూడా షుగర్ ప్రధాన కారణం అవుతోంది. పురుషులు, మహిళల లైంగిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడ‌రు, చ‌ర్చించ‌రు. లైంగిక ఆరోగ్యం గురించి అమోర్ ఆసుప‌త్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగం చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ ఉదయ్ లాల్ మాట్లాడుతూ, “డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారి సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డాన్ని వైద్య‌వ‌ర్గాలు గ‌మ‌నిస్తున్నాయి. వారిలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే మధుమేహంతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్స్ వినియోగం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి లాంటివి ఉద్యోగ జీవితంలో ఉన్న‌వారిలో ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ ముప్పును త్వరగా పరిష్కరించకపోతే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ జనాభా సంఖ్యపై ప్రతికూల ప్రభావం ప‌డుతుంది.

లైంగిక పటుత్వం ఎందుకు తగ్గుతుంది..?

Etihad-Airways

టెస్టోస్టెరాన్ అనేది ఒక సెక్స్ హార్మోన్, ఇది సంతానోత్పత్తి, సెక్స్ డ్రైవ్, ఎముకల బ‌రువు, కొవ్వు పంపిణీ, కండరాల బ‌రువు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో సహా మానవ శరీరంలోని కొన్ని ప్రక్రియలను నియంత్రిస్తుంది. పెరుగుతున్న డయాబెటిస్ స్థాయి, టెస్టోస్టెరాన్ స్థాయిపై దాని ప్రతికూల ప్రభావాల మధ్య సంబంధాన్ని కొంతమంది పరిశోధకులు కనుగొన్నారు. 2020 ప్రారంభం నుంచి, లైంగిక కార్యకలాపాల పట్ల ఆసక్తిని కోల్పోతు న్నట్లు ఫిర్యాదు చేసే యువకుల సంఖ్య 10శాతం పెరగ‌డాన్ని మేము గ‌మ‌నించాము. వీరిలో చాలామందికి మ‌ధుమేహం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. మధుమేహం వల్ల కొన్ని నరాలు ,రక్తనాళాలు దెబ్బతిని.. త‌ద్వారా లైంగిక సామ‌ర‌ర్థ్యం త‌గ్గ‌డం అనే ల‌క్ష‌ణం క‌నిపిస్తుంది” అని డాక్టర్ ఉదయ్ లాల్ అన్నారు.

మరి పరిష్కారం ఏంటి..?

దేశంలో, సమాజంలో పెరుగుతున్న మ‌ధుమేహ స‌మ‌స్య‌ను పరిష్కరించడానికి అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. భారతీయ జనాభా భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఈ తీవ్రమైన సమస్యపై అవగాహన పెంచడానికి వైద్య‌, ఆరోగ్యరంగ నిపుణులు గ‌ట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తగినంత నిద్ర, ధూమపానం మానుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవ‌డం లాంటి ఆరోగ్యకరమైన జీవనంతో పాటు.. జీవనశైలి మార్పులు కూడా మ‌ధుమేహ స్థాయిని నియంత్రించడానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇది శారీరకంగా మానసికంగా, లైంగికంగా సంతృప్తి గా ఉండేలా చేస్తుంది.

error: Content is protected !!