365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఆగస్టు 29,2022: కరోనా అనంతరం సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఇంటి వంటల పట్ల మొగ్గు చూపుతున్నారని, ఈ నేపధ్యం లో షీరో హోమ్ ఫుడ్ సంస్థ మహిళలకు ఒకే రుచి ..ఒకే రంగు, అలాగే శుచి శుభ్రత ఉండేలా శిక్షణ ఇచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందలాది కిచెన్ లు ప్రారంభింపచేసి మహిళల స్వయం ఉపాధి అందిస్తున్న తీరు అమోఘం అని, షీరో ఫౌండేషన్ ఉచిత సెమినార్ కి విచ్చేసిన అతిధులు పేర్కొన్నారు .
తెలుగు, తమిళ , ఉత్తరాది వంటకాలు వేగంగా తయారు చేసి ఆన్ లైన్ ద్వారా ఏ విధంగా తయారు చెయ్యాలి అనే అంశం పై లక్డీకాపూల్ వాసవి క్లబ్ లో షీరో హోమ్ ఫుడ్ నిర్వహించిన సెమినార్ లో 300 మంది మహిళలు పాల్గొని అన్ని వివరాలను సమగ్రం గా తెలుసుకున్నారు.
మిస్సెస్ ఇండియా ఏసియా పసిఫిక్ సుధా జైన్ & ప్రముఖ మోడల్, ఫుడ్ ఇన్ఫ్లుఎంసెర్ స్వప్న కొరిపలు ఈ కార్యక్తమానికి మోటివేషన్ స్పీకర్లుగా విచ్చేసి ఇంటి వంటలకు పెరుగుతున్న ఆదరణ, ఆన్ లైన్ ద్వారా స్వయంఉపాధి కల్పించే అంశాలపై అవగాహన కల్పించి వారిలో ఉత్సాహాన్ని కల్పించారు. షీరో సంస్థ కన్వీనర్ సువర్ణా దేవి పాకలపాటి మహిళల అనేక సందేహాలకు సమాధానాలిచ్చారు. మహిళల అభ్యున్నతికి టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు.