365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, రాజేంద్రనగర్, ఏప్రిల్15, 2024: రాజేంద్రనగర్ లోని శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 పదవ తరగతి చదివిన విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. దాదాపు 21ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకుని, బాగోగులు తెలుసుకున్నారు.
ఆదివారం శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలను ఘనంగా సత్కరించారు. నిర్వహించుకున్నారు. నాటి పూర్వ విద్యార్థులు దాదాపు 21సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని తమ మిత్రులతో ఉత్సాహంగా ,ఉల్లాసంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
నాడు తమకువిద్యాబుద్ధులు నేర్పిన చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతోపంచుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి.
ఇక నుంచి టచ్లోఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్ పడమటి శ్రీధర్ రెడ్డి, నిరంజన్, శ్రీశైలం, అశోక్ కుమార్, మల్లయ్య, చారీ,ఇస్మైల్, కిషన్, సురేందర్,జినాత్ ఉనసా ఉపాధ్యాయినీ, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులందరినీ ఒకచోటకు చేర్చేందుకు వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసింది కవిత. ముందుకు వచ్చి అందర్నీ కలిపి ప్రయత్నం చేసింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మొదటగా శ్రీకారం చుట్టింది కవిత ఆమెతోపాటు మిగతా మిత్రులు కూడా ఆమెతోపాటు తమ వంతుగా నెంబర్లు తమ క్లాస్మేట్స్ నెంబర్లు సేకరించి స్కూల్ సంబంధించిన గ్రూప్ లో యాడ్ చేశారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి కవిత ,హైమావతి ఎంతో కృషి చేశారు.ఈ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు కొంత మంది చాలా కష్టపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు ముందుండి నడిపించారు.అందరు విద్యార్థులు కలసి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: ఇన్వర్టర్ బ్యాటరీలో ఎంత నీరు నింపాలి..?
ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదం పుస్తకాలు ఉచితం..
ఇది కూడా చదవండి: డా.బి.ఆర్.అంబేద్కర్ అప్పుడు న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసింది ఇందుకే..