365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మే 9, 2022: భారతదేశములో ఫ్యాషన్,అందానికి గమ్యస్థానముగా పేరెన్నిక గన్న షాపర్స్ స్టాప్, తమ ప్రైవేట్ బ్రాండ్స్ పై దృష్టి కేంద్రీకరించుటకు ఒక ముఖ్యమై న వ్యూహాత్మక స్తంభముగా, ఎంపిక చేసిన ప్రైవేట్ బ్రాండ్స్ కొరకు సాన్యా మల్హోత్రాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఇది మహిళా కొనుగోలుదారులతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకొనుటకు,అదే సమయములో తమ ప్రైవేట్ లేబుల్ పోర్ట్ ఫోలియోను నిర్మించుటకు షాపర్స్ స్టాప్ వ్యూహముతో సమకాలీకరణతో ఉంది.
సాన్యా ఉల్లాసవంతమైన, వెచ్చనైన, స్వాగతించే,చైతన్యవంతమైన వ్యక్తిత్వము షాపర్స్ స్టాప్ బ్రాండ్ పొజిషనింగ్ తో ప్రతిధ్వనిస్తుంది. సాన్యా సామాజిక ఉనికి, ఆమె ఉల్లాసవంతమైన, ఉత్సాహవంతమైన వ్యక్తిత్వము,స్టైల్, షాపర్స్ స్టాప్ తన ప్రైవేట్ బ్రాండ్స్ ద్వారా వివిధ భౌగోళిక ప్రదేశాలలో బాగా కనెక్ట్ అవ్వటానికి సహాయపడు తుంది.
ఈ సాహచర్యం గురించి మాట్లాడుతూ, శ్రీ. వేణు నాయర్, కస్టమర్ కేర్ అసోసియేట్, ఎండి & సిఇఓ, షాపర్స్ స్టాప్ ఇలా అన్నారు, “షాపర్స్ స్టాప్ కు ప్రైవేట్ బ్రాండ్స్ ఒక వ్యూహాత్మక స్తంభముగా కొనసాగుతున్నాయి. మేము మా ప్రైవేట్ బ్రాండ్స్ వాటాను పెంచడముపై ప్రాధాన్యతను ఇస్తున్నాము. మా ప్రైవేట్ బ్రాండ్స్ కొరకు అంబాసిడర్ గా సాన్యా మల్హోత్రా ఉండటము మా వినియోగదారులతో మెరుగైన ప్రతిస్పందనను సృష్టించడములో సహాయపడుతుంది. బ్రాండ్ లక్షణముతో ఆమె అందంగా సరిపోతారు,అన్ని ప్రాంతాలలోని వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు ఆమెకు గొప్ప వ్యక్తిత్వము ఉంది.”
సాన్యా మల్హోత్రా ఇలా అన్నారు, “తన ప్రైవేట్ బ్రాండ్స్ కొరకు షాపర్స్ స్టాప్ తో నా మొదటి అనుబంధ ప్రయత్నము, నేను విశ్వసించే నా స్టైల్ తో నా ఫ్యాన్స్ తో కనెక్ట్ చేస్తుంది. షాపర్స్ స్టాప్ తో భాగస్వామి కావడానికి నేను ఎంతో ఉత్తేజితంగా ఉన్నాను. ఈ బ్రాండ్ తోనే నేను పెరిగి పెద్దయ్యాను,ఇష్టపడ్డాను. వారి ప్రైవేట్ బ్రాండ్స్ కొరకు వీరితో అసోసియేట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరానికి వారి ఉత్తమ సేకరణను ప్రదర్శించుటకు నేను ఎదురుచూస్తున్నాను.