Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 27,2022:మెటా తన యాప్‌ల ఫ్యామిలీలో మానిటైజేషన్ డ్రైవ్‌ను రెట్టింపు చేయడంతో, భారతదేశంలో వాట్సాప్ పెయిడ్ మెసేజింగ్ మార్కెట్‌కు పెద్ద అవకాశంగా మారబోతోందని మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

కంపెనీ Q3 రిజల్ట్స్ సందర్భంగా చెల్లింపు సందేశం అనేది మేము ట్యాప్ చేయడం ప్రారంభించిన మరో అవకాశం అని జుకర్‌బర్గ్ చెప్పారు. “మేము భారతదేశంలో వాట్సాప్‌లో జియోమార్ట్‌ను ప్రారంభించాము, ఇది మా మొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం, వాట్సాల్ప్ ద్వారా చాట్-ఆధారిత వాణిజ్యానికి అవకాశం ఉంటుందని ” జుకర్‌బర్గ్ చెప్పారు.

“కాబట్టి క్లిక్-టు-మెసేజింగ్ – చెల్లింపు సందేశాల మధ్య, ఇది ఒక పెద్ద అవకాశంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను,” అన్నారాయన. ఆగస్టులో, Meta – Jio ప్లాట్‌ఫామ్‌లు ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని ప్రారంభించాయి, ఇక్కడ వినియోగదారులు వాట్సాప్ చాట్ ఉపయోగించి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ JioMart నుంచి షాపింగ్ చేయవచ్చు.

కొత్త అనుభవం కస్టమర్‌లు JioMart కేటలాగ్‌ను బ్రౌజ్ చేయడానికి, కార్ట్‌కి ఉత్పత్తులను జోడించడానికి WhatsAppలో కొనుగోళ్లు చేయడానికి అనుమతిస్తుంది. పెయిడ్ మెసేజింగ్ ఆశయాన్ని కొలవడానికి కంపెనీ ఇప్పుడు పునాది వేస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు.

జియోమార్ట్-వాట్సాప్ ప్రారంభం భారతదేశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయడానికి , ప్రజలు – వ్యాపారాలను కొత్త మార్గాల్లో కనెక్ట్ చేయడానికి దేశంలో ఆర్థిక వృద్ధికి కోసం మెటా – జియో ప్లాట్‌ఫామ్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది.

“భారతదేశంలో జియోమార్ట్‌తో మా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము. వాట్సాప్‌లో ఇది మా మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం – ప్రజలు ఇప్పుడు చాట్‌లో JioMart నుంచి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు, ”అని జుకర్‌బర్గ్ గతంలోనే ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

“బిజినెస్ మెసేజింగ్ అనేది నిజమైన మొమెంటం కలిగిన ప్రాంతం -ఇలాంటి చాట్-ఆధారిత అనుభవాలు రాబోయే సంవత్సరాల్లో ప్రజలు , వ్యాపారాలు కమ్యూనికేట్ చేయడానికి వెళ్ళే మార్గంగా ఉంటాయని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. వాట్సాప్‌లోని జియోమార్ట్ నంబర్‌కు ‘హాయ్’ అని పంపడం ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌లో షాపింగ్ చేయడం ప్రారంభించవచ్చు.

error: Content is protected !!