Wed. Dec 25th, 2024
fashion-show_365

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 15,2023: ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్‌ హైనెస్‌ అందాల పోటీల కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని ఎఫ్‌ హౌజ్‌లో మంగళవారం సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఉర్రూతలూగించింది.

విభిన్నమైన వస్త్రధారణతో ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలొలి కించారు. అందచందాలతో అందరినీఆకట్టుకున్నారు. ఇప్పటిదాకా సినిమా, లైఫ్‌స్టైల్‌ ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా పేరు సంపాదించుకున్న తాము ఫ్యాషన్‌ రంగంలోకి అడుగిడుతున్నామని శ్రేయాస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌వెల్లడించారు.

fashion-show_365

మార్చి నెల్లో హైదరాబాద్ వేదికగా మిస్ హైనెస్ నిర్వహిస్తారు. దేశంలోని వివిధ నగరాల్లో ప్రతి నెల మిస్‌ హైనెస్‌ అందాల పోటీల నిర్వహించి వచ్చే ఏడాది గ్రాంట్ ఫినాలే దుబాయ్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వివిధ నగరాలకు చెందిన మోడల్స్‌ ఈ పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌షోకు సంబంధించిన క్రౌన్‌ను లాంచ్‌ చేసి, పోస్టర్ ను అన్విల్ చేశారు.

error: Content is protected !!