365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ జనవరి 7, 2026: దేశంలోని ప్రముఖ టీఎమ్‌టీ (TMT) తయారీ సంస్థ ‘శ్యామ్ స్టీల్’ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది.
నిర్మాణ రంగంలో నాణ్యతకు, భద్రతకు మారుపేరుగా నిలిచిన శ్యామ్ స్టీల్, హర్మన్‌ప్రీత్ నాయకత్వ పటిమను తమ బ్రాండ్ ఇమేజ్‌కు జోడించడం ద్వారా వినియోగదారుల్లో మరింత నమ్మకాన్ని పెంచాలని భావిస్తోంది.
నిర్ణయాధికారంలో మహిళలే కీలకం
గృహ నిర్మాణం, భద్రత,దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని శ్యామ్ స్టీల్ గుర్తించింది. “బలమైన మహిళ.. బలమైన ఉక్కు.. బలమైన భారతదేశం” అనే థీమ్‌తో రూపొందించిన ఈ భాగస్వామ్యం, ఆధునిక భారతీయ మహిళల ఆలోచనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.
ఇదీ చదవండి :తెలంగాణ యువతకు భారీ చాన్స్: క్విక్ కామర్స్‌లో 5,000పైగా ఉద్యోగాల అవకాశాలు..
ఇదీ చదవండి :టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవం: శాంసంగ్ ‘గెలాక్సీ బుక్ 6’ సిరీస్ లాంచ్..!
‘అప్నా ఘర్’ డిజిటల్ కార్యక్రమం
హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గానే కాకుండా, శ్యామ్ స్టీల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అప్నా ఘర్ – పునాది నుంచి గృహప్రవేశం వరకు” అనే డిజిటల్ క్యాంపెయిన్‌లో కూడా క్రియాశీలకంగా పాల్గొంటారు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రణాళిక, మెటీరియల్ ఎంపిక ,నిపుణుల సలహాల ద్వారా ఈ ప్రోగ్రామ్ దిశానిర్దేశం చేస్తుంది.
ఇదీ చదవండి :“సంక్రాంతి సంబరాల్లో ‘ట్రెండ్స్’ సందడి: పండుగ షాపింగ్‌పై అదిరిపోయే బహుమతులు!”
మేనేజ్‌మెంట్ మాటల్లో..
లలిత్ బెరివాలా (డైరెక్టర్, శ్యామ్ స్టీల్): “హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలో చూపే సంకల్ప బలం, నాయకత్వం మా బ్రాండ్ విలువలకు అద్దం పడతాయి. ఆమెతో కలిసి ప్రయాణించడం మాకు గర్వకారణం.”

మేఘా బెరివాలా గుప్తా (డైరెక్టర్): “నేడు ఇళ్ల నిర్మాణంలో మహిళలు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు, కీలక నిర్ణయాధికారులు. వారి నమ్మకానికి హర్మన్‌ప్రీత్ సరైన ప్రతిరూపం.”
ఈ భాగస్వామ్యంపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ.. “శ్యామ్ స్టీల్ లాంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌తో, ముఖ్యంగా వారి ‘అప్నా ఘర్’ ప్రోగ్రామ్‌తో అనుబంధం కలగడం సంతోషంగా ఉంది. సరైన నిర్ణయం తీసుకోవడమే బలమైన ఇళ్లకు, తద్వారా బలమైన దేశానికి పునాది అని నేను నమ్ముతాను” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉత్తర,తూర్పు భారత దేశంలో బలమైన ఉనికిని కలిగిన శ్యామ్ స్టీల్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ రాకతో తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రాండ్ మరింత చేరువవుతుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.
