Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 22, 2024: నాణ్యత, సస్టైనబిలిటీకి కట్టుబడిన ప్రముఖ డైరెక్ట్ టు కస్టమర్ (D2C) డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్, గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియంలో మొట్టమొదటి హైదరాబాద్ హెల్త్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో 2,000 మందికి పైగా రన్నర్లు పాల్గొనడం ద్వారా ఫిట్‌నెస్, కమ్యూనిటీ, ఆరోగ్యం కోసం అంకితమైన ప్రత్యేకమైన రోజుగా మారింది.

రన్నింగ్ ఈవెంట్ మూడు విభాగాలలో జరిగింది: 10కె టైమ్డ్ రన్, 5కె టైమ్డ్ రన్, 2కె నాన్ టైమ్డ్ రన్. ఈ రన్నింగ్ విభాగాలు అన్ని వయసుల రన్నర్లను ఆకట్టుకున్నాయి. కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు సహా ఫిట్‌నెస్ అభిమానులు ఈ ఈవెంట్‌లో సంతోషంగా పాల్గొన్నారు. గిగిల్ మగ్ ఈవెంట్స్ ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ, “సిద్స్ ఫార్మ్‌లో మేము నాణ్యమైన పాల ఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా మా కమ్యూనిటీకి సేవ చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాము. హైదరాబాద్ హెల్త్ రన్ మా కమ్యూనిటీ కోసం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నం,దీని విజయాన్ని చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాము” అన్నారు.

ఈ ఈవెంట్‌లో 10కె రన్ (18-40 వయస్సు విభాగం) విజేతగా ప్రేమ్ చంద్ 32:46 సమయంలో విజయం సాధించగా, నెలిసివే జిసినిలె మాగోంగో 45:32 సమయంలో ముగించింది. 5కె విభాగంలో కెవిబి రెడ్డి 19:57 సమయంలో, పింకీ గుప్తా 27:06 సమయంలో విజేతలుగా నిలిచారు. 2కె విభాగంలో వివిధ వయసుల నుంచి పలువురు పాల్గొన్నారు. రన్నరప్‌గా 10కె విభాగంలో విజయ్ ఠాకూర్, రవికుమార్ ఉన్నారు. మేఘనా భూపతిరాజు ,అష్ని భూపతిరాజు 5కె ఫిమేల్ అండర్ 18 విభాగంలో విజయం సాధించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్, టిఎస్ఐఐసి; సీతా పల్లచోళ్ల, WE హబ్ సీఈఓ; శ్రీనివాస్ రావు మహంకాళి (MSR), టి-హబ్ సీఈఓలు పాల్గొని, ఆరోగ్యం, స్టార్టప్‌లు,కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని తెలియజేశారు.

సిద్స్ ఫార్మ్ T-Hub, WE-Hub, BIA బ్రాండ్స్,RED. హెల్త్ వంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. BIA బ్రాండ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న వారికి తమ ప్రసిద్ధ స్నాక్స్,కాఫీని అందించింది, RED. హెల్త్ వైద్య సహాయం అందించింది.

హైదరాబాద్ హెల్త్ రన్ ద్వారా కమ్యూనిటీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఒక ముందడుగు వేసిన సిద్స్ ఫార్మ్, రాబోయే సంవత్సరాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఆశగా ఎదురుచూస్తోంది.

error: Content is protected !!