365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 24, 2024:ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభ్ 2025లో సిగ్నిఫై తమ ఆవిష్కరణాత్మక, హరిత లైటింగ్ పరిష్కారాలతో భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలను మరింత గొప్పగా మలచుతోంది.
సిగ్నిఫై ఫిలిప్స్ యూని సౌర శక్తి ఆధారిత డైనమిక్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి విమాన మండపం, శాస్త్రి వంతెనలను ప్రకాశవంతం చేయడంతో పాటు, కుంభమేళా మైదానంలో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సౌర లైట్లను విస్తరించింది.
విమాన మండపం: విశిష్టమైన ఆధ్యాత్మిక కాంతి
కుంభమేళా కేంద్రంలో ఉన్న పవిత్రమైన విమాన మండపం ప్రత్యేక లైటింగ్ డిజైన్‌ను పొందింది. సిగ్నిఫై ఉపయోగించిన డైనమిక్ కలర్-ఛేంజింగ్ లీనియర్ గ్రేజర్లు, ఫ్లడ్ లైట్లు, నిర్మాణాన్ని సన్నిహితంగా ఉజ్వలంగా చూపించడంతో పాటు దాని ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాయి. శిల్పకళా క్లిష్టతలను అధిగమించి ఈ లైటింగ్ వ్యవస్థ అద్భుతమైన అనుభవాన్ని భక్తులకు అందించింది.

ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాసిని అనుసంధానించే ప్రముఖ శాస్త్రి వంతెన RGBW లీనియర్ గ్రేజర్ల ద్వారా ప్రకాశవంతమైంది. ఈ లైటింగ్ డిజైన్ నిలువుగా ఉన్న స్తంభాలను, క్షితిజ సమాంతర డెక్‌ను హైలైట్ చేస్తూ సమతుల్యమైన లైటింగ్ అనుభవాన్ని కల్పించింది. డిఎంఎక్స్ నియంత్రణ ద్వారా వంతెనను రంగుల పండుగగా మార్చారు.
సౌర శక్తి: మహా కుంభ్‌కి ఆవిష్కరణాత్మక పరిష్కారం
175 lm/w సామర్థ్యంతో కూడిన SunStay Hybrid solar lightsను మోహరించి, మేళా స్థలాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. ఈ సౌర లైట్లు రాత్రంతా ప్రకాశాన్ని కల్పించడంతో పాటు మేఘావృత పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పని చేస్తాయి. ఈ ప్రయత్నం ద్వారా సిగ్నిఫై పునరుత్పాదక ఇంధన పరిష్కారాల్లో ముందడుగు వేసింది.
సిగ్నిఫై గేటర్ ఇండియా ప్రొఫెషనల్ బిజినెస్ హెడ్ గిరీష్ కె చావ్లా మాట్లాడుతూ, “మా #BrighterLivesBetterWorld దార్శనికతకు అనుగుణంగా, మహా కుంభ్‌లో స్థిరమైన లైటింగ్ పరిష్కారాలు అందించగలగడం గర్వకారణంగా భావిస్తున్నాము.
ఈ ప్రయత్నం పర్యావరణ సంరక్షణకు మా నిబద్ధతను తెలియజేస్తుంది. మహా కుంభ్ 2025 మా వినూత్నతకు ప్రతీకగా నిలుస్తుంది” అని తెలిపారు.

మహా కుంభ్ 2025కు లక్షలాది మంది భక్తులు హాజరుకానుండగా, సిగ్నిఫై అందించిన లైటింగ్ పరిష్కారాలు ఈ మాస్ గ్యాదరింగ్‌లో ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయని సిగ్నిఫై విశ్వసిస్తోంది.