365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 11,2026 : గత ఏడాది కాలంగా పసిడికి పోటీగా పరుగులు పెడుతున్న వెండి.. మున్ముందు మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
2025లో ఏకంగా 170 శాతం భారీ లాభాలను పంచిన ఈ ‘శ్వేత లోహం’, 2026లోనూ అదే జోరును కొనసాగిస్తుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్ (Motilal Oswal) అంచనా వేసింది.
ప్రస్తుత స్థాయిల నుంచి వెండి ధర మరో 27-28 శాతం పెరిగి, కిలో రూ. 3,20,000 మార్కును తాకే అవకాశం ఉందని విశ్లేషించింది.
పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే..

వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదపడుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. సౌర విద్యుత్ ప్యానెళ్లు (Solar PV), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) గ్రిడ్ మౌలిక సదుపాయాల రంగాల్లో వెండి వినియోగం రికార్డు స్థాయికి చేరింది.
హరిత ఇంధన వనరుల వైపు ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతుండటంతో పారిశ్రామికంగా వెండికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు, వాణిజ్య పరమైన ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
సరఫరాలో..
వెండి మైనింగ్ రంగంలో పెట్టుబడులు తగ్గడం, ఉత్పత్తి నెమ్మదించడం వల్ల గతేడాది డిమాండ్‌కు తగిన సరఫరా లేక మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురైంది. వరుసగా ఐదో ఏడాది కూడా సరఫరా లోటు కొనసాగుతుందని అంచనా.
ఈటీఎఫ్ (ETF) పెట్టుబడులు..

వెండి ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు గతేడాది రెండో అర్థభాగం నుంచి భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లు వెండిని కేవలం ఆభరణంగానే కాకుండా, పోర్ట్‌ఫోలియోను రక్షించే ప్రధాన ఆస్తిగా భావిస్తున్నారు.
మొదటి ఆరు నెలల్లోనే వెండి ధరల్లో..
2026 మొదటి ఆరు నెలల్లోనే వెండి ధరల్లో బలమైన పెరుగుదల కనిపిస్తుందని, అయితే ద్వితీయార్థంలో లాభాల స్వీకరణ (Profit Booking) వల్ల కొంత ఒడుదొడుకులు ఉండవచ్చని మోతీలాల్ ఒస్వాల్ హెచ్చరించింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఏఐపీసీ జాతీయ కార్యవర్గ సమావేశం: ‘ఆకాంక్షల రాజకీయాలే’ లక్ష్యం..
ఇదీ చదవండి:పిల్లల మరో దగ్గు సిరప్‌పై నిషేధం.. హర్యానా సర్కారు సెన్సేషనల్ డెసిషన్..!
అయినప్పటికీ, దీర్ఘకాలంలో వెండి పసిడిని మించి రాబడిని ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ‘బై ఆన్ డిప్స్’ అంటే ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం వ్యూహాన్ని సూచించింది. ఏదేమైనా వెండి ధరలు బంగారం ధరలను దాటే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
