Wed. Dec 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,12మార్చి,2022: నాటి నిజాం రాజులకు ఏకైక వస్త్ర పంపిణీదారులుగా సింఘానియాస్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాణ్యత, వినియోగదారు విశ్వాసాన్ని పొందడమే నాటి నుంచి నేటి వరకు సింఘానియాస్ వ్యాపారలక్ష్యంగాకొనసాగుతోంది. మొదట్లో హోల్ సేల్ వస్త్ర వ్యాపారంలో ఉన్న మేము 1999లో రిటైల్వ్యా పారరంగ లోకి అడుగుపెట్టాము. కళాత్మకతను ప్రస్ఫుటంగా వెల్లడించడంలో చేనేత సంప్రదాయం ఒకటి బలంగా విశ్వసించే బ్రాండ్ గా ప్రత్యేకమైన గుర్తింపును పొందిన సింఘానియాస్ ఈ కళా నైపుణ్యాన్ని మరింతగా ప్రపంచానికి పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో 2004లో బంజారాహిల్స్ లో మొదటి స్టోర్ ను ప్రారంభించింది. ఈ వైభవోపేతమైన వారసత్వం మరింత ముందుకెళ్తుంన్నందుకు మేం గర్వపడుతు న్నాం.

సింఘానియాస్ తమ రెండో స్టోర్ ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ప్రారంభించింది. నేత కళాకారుల వద్దనుంచి గత కొన్నేళ్లుగా సేకరించిన చక్కనైన కళాత్మక రూపాలన్నింటినీ ఈ స్టోర్ లో మీకు అందుబాటులో ఉంటాయి. అవార్డులు అందుకున్న కళాకారులు, నేతరంగంలోని నిపుణుల కృతుల ప్రదర్శనకు ఈ స్టోర్ లోని గోడలను అంకితం చేశాం. అత్యుత్తమ నాణ్యత, డిజైనర్ వస్త్రాలతో కూడిన వాల్ ప్యానెల్‌లు, సిల్క్ ఇకత్, ఆర్గాన్జా, హ్యాండ్ పెయింటెడ్ సిల్క్, బ్లాక్ ప్రింటెడ్ కాటన్‌, బనారసీ, కంచి సిల్క్ తోపాటుగా ఈ దేశపు వస్త్ర సంస్కృతిని ప్రతిబింబించే మరెన్నో ఆకట్టుకునే వస్త్రాల విస్తృతమైన శ్రేణి మీకోసం అందుబాటులోకి వచ్చింది. స్టోర్‌లో అందుబాటులో ఉన్న 250 కంటే ఎక్కువ రంగుల ముడి సిల్క్ వస్త్రాలు ఏ చీరకైనా, బ్లౌజ్ కైనా, లెహెంగా కైనా అద్దినట్టుగా సరిపోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పెళ్లికూతురు వస్త్రాలు, చక్కటి లెహంగాలు, అన్ స్టిచ్డ్ సూట్లు, కుట్టిన సూట్లు ఇలా సంపూర్ణ వివాహ మహోత్సవానికి కావాల్సిన అన్ని వస్త్రాలు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మీ మది దోచుకుంటాయి. ప్రతి విభాగంలోని వస్త్రాలను ప్రత్యేకమైన స్టైలిస్ట్ ల బృదం రూపొందించింది. వివిధ సీజన్లకు అనుగుణంగా వివిధ రకాల వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కళాకారుల నైపుణ్యం, వారి అరుదైన పనితనాన్ని విస్పష్టంగా చూపించే వస్త్రాలు ఈ కొత్త స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.

‘పెద్ద స్టోర్స్, దుకాణాలైనా, ఆన్ లైన్ చానల్స్ అయినా నేటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆనందకర అనుభవాన్ని పొందడం తప్పనిసరి. కానీ మా వద్ద దొరికే ప్రత్యేకమైన డిజైన్లు, మా స్టైల్ టీమ్ ల నైపుణ్యత ద్వారా పురాతన సంప్రదాయానికి ఆధునిక పద్ధతులను అందించే వెరైటీలు మాకు గర్వకారణం. మా స్టోర్ ను సందర్శించి మా వద్ద మీకోసం రూపొందించిన ప్రత్యేకమైన డిజైన్లను తిలకించండి. మీరు అపూర్వమైన అనుభూతికి లోనవుతారని మీకు హామీ ఇస్తున్నాం. మేము 150 ఏళ్లుగా వస్త్రప్రపంచంలో అద్భుతమైన సేవలందిస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు అదే నాణ్యతను, అదే విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాం’ అని ఈ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా శైలేశ్ సింఘానియా వెల్లడించారు.

error: Content is protected !!