Mon. Dec 23rd, 2024
Site inspection for construction of bus station on Jaggayyapeta highway

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జగ్గయ్యపేట,సెప్టెంబర్ 2,2022: ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. శుక్రవారం జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ ఛైర్మన్ ఆర్.రాఘవేంద్ర, మున్సి పల్ కమిషనర్ భూపాల్ రెడ్డి , ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్ తో కలిసి హైవే మీద బస్సు స్టేషన్ నిర్మాణం కోసం స్థలం పరిశీలించారు.

గతంలో దాతలు ఇచ్చిన స్థలం బస్సు రాకపోకలకు అనుకూలంగా లేనందున ఆ ప్రతిపాదనను విరమించుకోవడం జరిగింది. ఆటోనగర్ ప్రాంతంలో పాత హైవేను ఆనుకుని ఉన్నషేర్ మొహమ్మద్ పేట, సర్వే నంబర్లు 237,238, 239లో ఉన్న ఏ.పి.ఐ.ఐ.సి. వారి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. హైవే మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణీకుల సౌకర్యార్ధం 1.20 ఎకరాల స్థలంలో బస్సు స్టేషన్ నిర్మించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రయాణీకుల సౌకర్యార్ధం నిర్మించే బస్ స్టేషన్ కొరకు ఆ స్థలాన్ని ఏ.పి.ఐ. ఐ.సి. అధికారులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ బస్ స్టేషన్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను తన నియోజక వర్గ నిధుల నుంచి రూ. 50 లక్షలు CSR ఫండ్స్ నుంచి కూడా రూ. 15 లక్షలు సమీకరించడానికి హామీ ఇచ్చారు.

ఈ బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా మొదలు పెట్టేందుకు ప్రభుత్వ అనుమ తులు పొందేందుకు ప్రతిపాదనలను వెంటనే పంపవలసిందిగా ఆర్టీసీ వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం, ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్ ని కోరారు. జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గవర్నమెం ట్ లో అన్ని అనుమతులు తొందరగా సాధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Site inspection for construction of bus station on Jaggayyapeta highway

భక్తులు ఒకే రోజులో వేదాద్రి, ముత్యాల,పెనుగంచిప్రోలు ఆలయాలను సందర్శించేలా అనువుగా ఉండేందుకు ఆ 3 ఆలయాలని కలుపుతూ ఒక ప్రత్యేక బస్సు నడపమని ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం, జగ్గయ్య పేట డిపో మేనేజర్ ప్రసాద్ లను ఆర్టీసీ ఎం.డి. సి.హెచ్.ద్వారకా తిరుమల రావు ఆదేశించారు.

error: Content is protected !!