365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 31, 2025: భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపాన్ని మలుపుతిప్పే శక్తిగా ఎదుగుతున్న ఏజెంటిక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) 2030 నాటికి భారతదేశంలో10.35 మిలియన్ల ఉద్యోగాలను పునర్నిర్వచించనుందన్న అంచనాలు వెలువడాయి. ప్రముఖ టెక్‌ సంస్థ సర్వీస్‌నౌ విడుదల చేసిన ‘ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ మార్పు భారతదేశంలోని ప్రతిభావంతుల కోసం నూతన అవకాశాలను తెరలేపనుందని, ఉద్యోగుల పాత్రలు ప్రాసెస్‌-ఆధారిత విధానాల నుంచి లక్ష్యాధారిత ఆవిష్కరణల వైపు మారనున్నాయని నివేదిక పేర్కొంది.

ఇది మలుపు తిప్పే క్షణం – సుమీత్ మాథుర్
“2030 నాటికి ఏఐ ఆధారంగా 3 మిలియన్ల కొత్త టెక్‌ ఉద్యోగాలు సృష్టించబడతాయే కాదు, మొత్తం 10.35 మిలియన్ల వరకు ఉద్యోగాల స్వరూపం మారనుంది. భారతదేశం ఇప్పుడే కీలక దశలో ఉంది,” అని సర్వీస్‌నౌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుమీత్ మాథుర్‌ వెల్లడించారు.

ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ విశ్లేషణ:
భారత సంస్థలు ఇప్పటికే ఏఐ పరిపక్వతలో ముందుండగా, స్పష్టమైన దృష్టి, ప్లాట్‌ఫామ్‌ ఆధారిత ఆలోచన, సరైన ప్రతిభ మిశ్రమం, బలమైన పాలన వంటి అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్నాయి.
ఆ సంస్థల్లో 57% సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలని గమనించాయని నివేదిక పేర్కొంది.

ఏఐతో ఉద్యోగాల రూపాంతరం
ఉద్యోగ భవిష్యత్తులో వచ్చే మార్పులపై నివేదిక వివరించింది:

అధిక ఆటోమేషన్ బాధ్యతలున్న చేంజ్ మేనేజర్లు, పేరోల్ క్లర్కులు వంటి ఉద్యోగాలు ఏఐ ద్వారా కొత్తగా నిర్వచించబడుతున్నాయి.

ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్లు, సిస్టమ్ అడ్మిన్లు వంటి అధిక వృద్ధిశీల ఉద్యోగాలు ఏఐకి పోటీ కాకుండా భాగస్వాములవుతున్నాయి.

ఇది కూడా చదవండి…టాప్ పాడ్‌కాస్టర్ రాజ్ షమానీ ASUS ఎక్స్‌పర్ట్‌బుక్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపిక..

ముఖ్యంగా తయారీ (8 మిలియన్లు), రిటైల్ (7.6 మిలియన్లు), విద్య (2.5 మిలియన్లు) రంగాల్లో ఈ ప్రభావం గణనీయంగా ఉండనుంది.

భారత్‌కు విశాల అవకాశాలు
విశ్వంలోనే అత్యధిక యువ జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌‍ 2025 నాటికి 3 మిలియన్ల కొత్త టెక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశీయ సంస్థలు టెక్ బడ్జెట్‌లో 13.5%ను ఏఐ అభివృద్ధికి కేటాయించగా, 25% సంస్థలు ఇప్పటికే ఏఐ మలుపు దశలో ఉన్నట్టు నివేదిక తెలిపింది.

నైపుణ్యాలు – భద్రతే కీలకం
అయితే వేగవంతమైన ఈ మార్పులో సవాళ్లు ఎదురవుతున్నాయి. 30% సంస్థలు డేటా భద్రతను అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తుండగా, 26% సంస్థలు అవసరమైన భవిష్యత్ నైపుణ్యాలపై స్పష్టత లేకుండా ఉన్నాయి.

“భవిష్యత్‌కు సిద్ధంగా ఉండాలంటే సంస్థలు ఉద్యోగులను కేవలం అవుట్‌పుట్‌లను సమీక్షించేందుకు కాకుండా, ఆ అవుట్‌పుట్‌ల వెనుకనున్న డేటాను ప్రశ్నించగల సామర్థ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలి. ఏఐను నిజంగా సమర్థంగా వినియోగించాలంటే నమ్మకాన్ని నిర్మించాల్సిందే,” అని మాథుర్ వివరించారు.