ఒక్క లోడ్‌ను 68 నిమిషాల్లో వాష్, డ్రై చేసే అద్భుత టెక్నాలజీ..
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 9, 2025 : గృహోపయోగ సాధనాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తన స్మార్ట్ లాండ్రీ ఉపకరణాల శ్రేణి మరో అడుగు ముందుకేసింది. samsung.com
‘బెస్పోక్ ఏఐ లాండ్రీ వెంటెడ్ కాంబో’ పేరిట కొత్త ఆల్-ఇన్-వన్ వాషర్, ఎలక్ట్రిక్ డ్రైయర్‌ను ఆవిష్క రించింది. ఈ అత్యాధునిక ఉత్పత్తిలో 7 అంగుళాల ఏఐ హోమ్ టచ్‌స్క్రీన్ తో వచ్చింది. వాషింగ్ అనంతరం డ్రైయింగ్ కోసం లాండ్రీని వేరే యంత్రంలోకి మార్చాల్సిన అవసరం లేకుండా, ఈ కాంబో ఒకేసారి రెండు పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తుంది.

ఈ సందర్భంగా సామ్‌సంగ్ డిజిటల్ అప్లయెన్సెస్ డివిజన్ ఈవీపీ, ఆర్ అండ్ డీ హెడ్ జియోంగ్ సీయుంగ్ మూన్ మాట్లాడుతూ, “వినియోగదారుల జీవితాలను సౌలభ్యవంతం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. పనితీరులోనూ, డిజైన్‌లోనూ కొత్త పుంతలు తొక్కేలా ఈ ఉత్పత్తిని రూపొందించాం” అని పేర్కొన్నారు. samsung.com
Read this also…Birla Opus Paints Redefines Interior Luxury with New Range of Designer Finishes
ఇది కూడా చదవండి…ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి భారతదేశంలోని ఈ గ్రామానికి వచ్చిన అమెరికన్ యువతి..
Read this also…National Mart Concludes Festive Dhamaka Lucky Draw with Grand Celebration at Nagaram Store
వినియోగదారులకు..
ఈ బెస్పోక్ ఏఐ లాండ్రీ కాంబో యూఎస్‌లో డార్క్ స్టీల్, బ్రష్డ్ బ్లాక్ రంగుల్లో, కెనడాలో బ్రష్డ్ బ్లాక్ రంగులో, మెక్సికోలో డార్క్ స్టీల్ రంగులో లభిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌లో ముందస్తు ఆర్డర్లు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. కెనడా, మెక్సికోలో 2025 రెండో త్రైమాసికంలో అమ్మకాలు మొదలవుతాయని వెల్లడించింది.