365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, 11 డిసెంబర్ 2020: మెర్క్యూర్ హైదరాబాద్ కెసీపీ తమ వార్షిక ఫ్రూట్ సోక్ అండ్ మిక్సింగ్ వేడుకలను నిర్వహించడం ద్వారా పండుగ సీజన్ స్ఫూర్తిని నిలిపింది. క్రిస్మస్ స్ఫూర్తిని వేడుక చేసేందుకు శీతాకాలపు పండుగలను క్రిస్మస్ విందులతో సెలెబ్రేట్ చేసేందుకు సంప్రదాయంగా కేక్ మిక్సింగ్‌ను నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా లాగానే, ఫ్రూట్ మిక్సింగ్‌లో రెడ్ చెర్రీలు, టూటీ –ఫ్రూటీ, బ్లాక్ కరెంట్స్, ఖర్జూర, బాదములు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అప్రికాట్స్ , ఫిగ్స్‌తో పాటుగా సువాసనలతో కూడిన దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, యాలికల పొడి, ఎండు అల్లం పొడి, జాజికాయ పొడి, స్టార్ అనీస్ వంటివి కలిపారు. ఈ సీజన్ స్ఫూర్తిని బాటిల్స్‌లో ఎంపిక చేశారు. వైన్ , రమ్, బ్రాందీ, విస్కీ వంటివి ఈ ఫ్రూట్స్ మునిగే వరకూ పోశారు. తమ ‘ఆల్–ఎకార్ లైవ్ లిమిట్ లెస్’ మొదటి వార్షికోత్సవ వేడుకల ప్రతీకగానూ నిర్వహించారు. ఎకార్‌కు చెందిన ఉత్సాహ పూరితమైన లైఫ్‌స్టైల్ లాయల్టీ ప్రోగ్రామ్.
మెర్క్యూర్ హైదరాబాద్ కెసీపీ జనరల్ మేనేజర్ సౌమిత్ర పహారీ, మాట్లాడుతూ ‘‘మెర్క్యూర్ హైదరాబాద్ కెసీపీ వద్ద సోక్ అండ్ మిక్స్ అనేది ఓ సంప్రదాయం. ఇక్కడ ప్రతి ఏటా ఈ వేడుకలనునిర్వహిస్తున్నాము.
మేముఈసంప్రదాయం..కొనసాగించాలనుకుంటున్నాం. అన్ని పారిశుద్ధ్య, భద్రతా ప్రాధాన్యతలను అనుసరిస్తూ కేక్ మిక్సింగ్‌ను మా అంతర్గత అతిధులు, ఆల్ ఎకార్ లైవ్ లిమిట్‌లెస్ అతిథుల సమక్షంలో జరుపుకున్నాం’’అని ఆయన అన్నారు.