Mon. Dec 23rd, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, నవంబర్ 4, 2021: భారతదేశంలో పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సోనాలికా ట్రాక్టర్స్‌ ఇప్పుడు రైతుల వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చడానికి పూర్తి సన్నద్ధమైంది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా దేశం నుంచి నెంబర్‌ 1 ఎగుమతి బ్రాండ్‌గా నిలిచిన సోనాలికా ట్రాక్టర్స్‌ ఈ పండుగ సీజన్‌లో కస్టమైజ్డ్‌ ట్రాక్టర్‌ పోర్ట్‌ఫోలియోతో అద్భుత విజయాలను నమోదు చేస్తుంది. సోనాలికా ఇప్పడు తమ అత్యధిక వైటీడీ సంఖ్యను 2022 ఆర్ధిక సంవత్సరంలో నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే (79,829 యూనిట్లు) ఈ సంవత్సరం 6.56% వృద్ధితో 85,068 యూనిట్లను విక్రయించింది. వ్యవసాయ యాంత్రికీకరణ దిశగా రైతులు ఆసక్తి కనబరుస్తుండటంతో అక్టోబర్‌లో 17,130 ట్రాక్టర్లు విక్రయించడంతో పాటుగా పరిశ్రమ వృద్ధి (3.6%)ను అధిగమించి 5.5% వృద్ధిని నమోదు చేసింది.

సోనాలికా ట్రాక్టర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమణ్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ‘‘సోనాలికా హెవీడ్యూటీ ట్రాక్టర్ల పై రైతులకు అపారనమ్మకం ఉంది. అది ఇప్పుడు మరోమారు నిరూపితం కావడంతో పాటుగా మా అద్భుతమైన ప్రయాణంలో మరో మైలురాయి అధిగమించడంలో తోడ్పడింది. మేము అత్యధిక వైటీడీ అక్టోబర్‌ 2021 అమ్మకాలు 85,068 యూనిట్లను 6.56% వృద్ధితో నమోదుచేశాం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతుల కోసం నగదుకు తగ్గ విలువను అందిస్తూ కస్టమైజ్డ్‌ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. వీటి కారణంగా అక్టోబర్‌ 2021లో 5.5% వృద్ధితో 17,130 ట్రాక్టర్లను విక్రయించగలిగాము’’ అని అన్నారు.

error: Content is protected !!