Tue. Dec 3rd, 2024
kinneramogilayya_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి17,2023: తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గాను దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి వచ్చే మంత్రి మండలి సమావేశంలో ప్రవేశ పెట్టనున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ వెల్లడించారు.

గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి కుమారి ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి మంత్రి నేడు ప్రధానం చేశారు.

kinneramogilayya_365

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి భారీ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.

జాతీయ, అంతర్జాతీయ పోటీలలో గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల నజరానా ప్రకటించి వారిని సముచితంగా గౌరవిస్తూ ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, ప్రోత్సహిస్తున్నదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిచేందుకు ప్రభుత్వం త్వరలో ఒక సరికొత్త Sports Policyని ఆవిష్కరించనున్నదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువత క్రీడలలో మంచి నైపుణ్యం ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో బంగారు పతకాలు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సత్కరించారు.

కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణా క్రీడా ప్రాంగణాలను నిర్మించి ప్రతీ క్రీడా ప్రాంగణానికి స్పోర్ట్స్ కిట్ లను అందచేస్తామని పేర్కొన్నారు.

ఉన్నత స్థాయి ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేసే కోచ్ లకు సరైన గుర్తింపు కల్పిస్తామని చెప్పారు.

error: Content is protected !!