Fri. Nov 8th, 2024
YERRUPALEM_New-railway-line

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 27,2023: దక్షిణ మధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణ కు అధిక ప్రాధాన్యమిస్తూ, పనులను వేగవంతం చేసింది, తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించిన మార్గాలకు జోడించింది.

ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ – కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. తద్వారా జోన్ పరిధిలో సికింద్రాబాద్ – ధర్మవరం మధ్య పూర్తిస్థాయిలో విద్యుదీ కరించిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపే వీలు కల్గింది.

గద్వాల్ – కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ ,డోన్-కర్నూలు సిటీ – మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్-ముద్ఖేడ్-మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేసి ఇప్పటికే విద్యుదీకరించారు.

ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్-గద్వాల్ ,కర్నూలు సిటీ -డోన్ ల విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్ – గుత్తి – ధర్మవరం, నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం – బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది.

YERRUPALEM_New-railway-line

అందువల్ల ప్యాసింజర్, సరకు రవాణా రైళ్లు రెండూ,ఇప్పుడు హైదరాబాద్ – ధర్మవరం, అటు బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది. తద్వారా, రైలు ప్రారంభ స్థానం నుంచి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో నడిపేందుకు వీలుపడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఇంజిన్ మార్పిడి ని నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుంది.

ప్రయాణికులు, సరకు రవాణా చేసే రైళ్ల మార్గం మధ్యలో నిలుపుదలను తగ్గిస్తుంది. రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా కానున్నాయి. అంతేకాదు కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందించడానికి కూడా ఇవి సహాయపడతాయి.

YERRUPALEM_New-railway-line

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచి, అంకితభావంతో పనిచేసినందుకు ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

గద్వాల్-కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100శాతం విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు.

error: Content is protected !!