365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్30,2021: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ స్వాగతించింది. శుక్రవారం ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి, అనేక మంది జర్నలిస్టులమరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించటం జరిగింది.

ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ బృందం విజ్ఞప్తి మేరకు శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులకు ప్రకటించారు. లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అదే విధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ నెంబర్ లైన్ 8639710241ను సంప్రదించవచ్చు.

