365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 3,2025: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా, టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీనివాస స్వామికి ప్రత్యేక ఊంజల్ సేవ నిర్వహించారు.

వేద పండితుల వేద మంత్రాల నడుమ, శ్రీ స్వామివారు వీణాపాణియై సరస్వతి అలంకారంలో ఊయలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భం లో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివెళ్లి స్వామివారి ఊంజల్ సేవను తిలకించి ఆనందంతో పరవశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ రామ్ గోపాల్, ఏఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.