365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 18, 2025: భారత ప్రభుత్వం వృద్ధుల కోసం అందిస్తున్న ప్రముఖ పొదుపు పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.
ఏజెన్సీ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ
భారత ప్రభుత్వానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏజెన్సీ బ్యాంకుగా వ్యవహరించనుంది. ఈ పథకం కింద డిపాజిట్లను సేకరించడంతో పాటు, ఖాతాదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించనుంది. అర్హత కలిగిన వ్యక్తులు బ్యాంక్‌కు చెందిన ఏదైనా బ్రాంచ్‌ను సందర్శించి SCSS ఖాతా తెరవొచ్చు.
Read this also…HDFC Bank Now Accepting Deposits Under Government of India’s Senior Citizens’ Savings Scheme
Read this also…Uber Launches Free Shuttle Rides in Hyderabad to Tackle Traffic Congestion..
ఈ పథకానికి 60 ఏళ్లు నిండిన వ్యక్తులు, 55 ఏళ్ల వయసులో లేదా అంతకు పైగా పదవీ విరమణ పొందిన వారు అర్హులు. అలాగే, రక్షణ రంగ ఉద్యోగులు 50 ఏళ్ల వయస్సు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకం ప్రత్యేకతలు
- సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
- త్రైమాసిక వడ్డీ చెల్లింపుతో ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి.
- మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం.
- ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు వర్తించనుంది.
ఇది కూడా చదవండి…హైదరాబాద్ లో ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఫ్రీ ఉబెర్ షటిల్ రైడ్స్..
పథకంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధి వ్యాఖ్యలు
ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, “సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయం అందించేందుకు ఈ పథకం ఉపకరిస్తుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఈ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మారుస్తుంది” అని తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విజయాలు
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను కూడా బ్యాంక్ అందిస్తోంది. FY24లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశవ్యాప్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా పన్ను వసూళ్లు నమోదు చేసింది. ప్రభుత్వానికి సంబంధించి అగ్రస్థానంలో నిలిచిన మూడు బ్యాంకుల్లో ఇది ఒకటి.