365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 15,2022:టిటిడి ఉద్యోగుల క్రీడలు మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు.
చెస్
ప్రత్యేక ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగుల పోటీల్లో బి.అరుణకుమారి విజయం సాధించగా, శ్రీమతి ఎం.విజయలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు. ప్రత్యేక ప్రతిభావంతులైన పురుష ఉద్యోగుల పోటీల్లో కె.రవికుమార్ విజయం సాధించగా, ఎంవిఎస్.సత్యం రన్నరప్‌గా నిలిచారు. పాక్షికంగా అంధులైన ఉద్యోగుల పోటీల్లో సి.రెడ్డప్పరెడ్డి విజయం సాధించగా, ఎస్.బయారెడ్డి రన్నరప్‌గా నిలిచారు.
పాసింగ్ ది లగేజ్
45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల పోటీలలో జి.చిన్నమునెమ్మ జట్టు విజయం సాధించగా, వి.రమాదేవి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
డాడ్జి బాల్
45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల పోటీలలో ఎం.శోభారాణి జట్టు విజయం సాధించగా, ఎం.మునిలక్ష్మి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
బాల్ బ్యాడ్మింటన్
45 ఏళ్లలోపు ఉద్యోగుల పోటీలలో చీర్ల కిరణ్ జట్టు విజయం సాధించగా, ఎ.ధనశేఖర్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగుల పోటీలలో గోపాలకృష్ణారెడ్డి జట్టు విజయం సాధించగా, ఎన్.చంద్రశేఖర్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
లాన్ టెన్నిస్
45 ఏళ్లలోపు ఉద్యోగుల సింగిల్స్ పోటీలలో వై.వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించగా, ఆర్.తులసీరామ్ రన్నరప్‌గా నిలిచారు. 45 ఏళ్లలోపు ఉద్యోగుల డబుల్స్ పోటీలలో వై.వేణుగోపాల్ రెడ్డి, ఎం.రమేష్ జట్టు విజయం సాధించగా, జి.విజయకుమార్ వర్మ, ఆర్.తులసీరామ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఫుట్‌బాల్
ఈ పోటీలలో టి.సంతానం జట్టు విజయం సాధించగా, ఓ.ఓబుల్‌రెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.