Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 10,2024:ఆర్మాక్స్ మీడియా (Ormax Media) ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో 67.8 కోట్ల మంది పైచిలుకు స్పోర్ట్స్ ఆడియన్స్ ఉన్నారు. ఈ క్రీడల్లో క్రికెట్, ఫుట్‌బాల్ టాప్‌లో ఉన్నాయి.

క్రికెట్‌కు 61.2 కోట్ల మంది, ఫుట్‌బాల్‌కు 30.5 కోట్ల మంది ఆడియన్స్ బేస్ ఉంది. ఈ వర్గం  ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమానికి ప్రాధాన్యం ఇచ్చే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో వారు స్పోర్ట్స్ కంటెంట్‌ను కనుగొనడం, వీక్షించడాన్ని టెలికం దిగ్గజం వీ మరింత సులభతరం చేస్తోంది.

ఒక్క సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఈ సీజన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద టీ20 క్రికెట్ టోర్నమెంటును డిస్నీ+ హాట్‌స్టార్‌లో, అలాగే యూఈఎఫ్ఏ యూరో 2024 ,కోపా అమెరికా క్రీడల పోటీలన్నింటిని వీ యూజర్లు, వీ మూవీస్ అండ్ టీవీ యాప్‌పై వీక్షించవచ్చు. వీక్షణ అనుభూతిని మరింత మెరుగుపర్చేందుకు ఈ ఈవెంట్లను కనెక్టెడ్ టీవీ ద్వారా కూడా స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని వీ కల్పిస్తోంది.

అంతే కాదు! డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్‌కు యాక్సెస్‌ను కూడా సరళతరం చేసేలా వీ ప్రత్యేకంగా బండిల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఆవిష్కరించింది. దీంతో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రేమికులు తమకిష్టమైన క్రీడలకు సంబంధించిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు.

వీ యుజర్లు స్పోర్టింగ్ యాక్షన్‌ను పొందేందుకు గల అవకాశాలను ఒకసారి చూస్తే:

వీ మూవీస్ టీవీ – లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ అన్నింటికీ ఒకే ప్లాన్ఒకే సబ్‌స్క్రిప్షన్

నెలకు రూ. 199కి (పోస్ట్-పెయిడ్), నెలకు రూ. 202కి (ప్రీ-పెయిడ్) వీ యూజర్లు, వీ మూవీస్ & టీవీ ప్రో ప్లాన్ ద్వారా ఓటీటీలను ఈ కింది విధంగా సులభతరంగా  పొందవచ్చు

·         నిరాటంకంగా యాక్సెస్: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద టీ20 క్రికెట్ టోర్నమెంట్, సోనీ లివ్‌లో యూఈఎఫ్ఏ యూరో 2024, జింబాబ్వేలో భారత్ టూర్ మరియు శ్రీలంకలో భారత్ టూర్, అలాగే కోపా అమెరికా కోసం ఫ్యాన్ కోడ్‌తో పాటు మరెన్నో అదనపు ప్రయోజనాలూ పొందవచ్చు.

·         పెద్ద స్క్రీన్ అనుభూతి: ఆండ్రాయిడ్/గూగుల్ టీవీ, సామ్‌సంగ్ టీవీ, అమెజాన్ ఫైర్‌స్టిక్ టీవీ, ఆండ్రాయిడ్ మొబైల్, ఐవోఎస్ మొబైల్, వెబ్‌తో పాటు కనెక్టెడ్ టీవీలకు కూడా వీ మూవీస్ & టీవీ అనువైనదిగా ఉంటుంది.

·         మరింత వినోదం: అదే సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లకు పలు భారతీయ భాషల్లో 13+ ఓటీటీ ప్లాట్‌ఫాంలు, 400+ టీవీ ఛానళ్లు, 15000+ మూవీస్ అందుబాటులో ఉంటాయి.

క్రికెట్ఫుట్‌బాల్ అభిమానుల కోసం డిస్నీహాట్‌స్టార్సోనీలివ్‌తో కూడుకున్న ప్రత్యేక ఓటీటీ బండిల్డ్ ప్లాన్లను వీ ప్రవేశపెట్టింది.

ప్రీపెయిడ్:

·         క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా యాడ్ ఆన్ ప్యాక్: ప్రపంచంలోనే అతి పెద్ద టీ20 క్రికెట్ టోర్నమెంటును డిస్నీ+ హాట్‌స్టార్‌లో మీ మొబైల్ ఫోన్స్ ద్వారా వీక్షించండి. కేవలం రూ. 169కే వీ యూజర్లు మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే 30 రోజుల వేలిడిటీతో 8జీబీ డేటాను కూడా పొందవచ్చు.

·         ఫుట్‌బాల్ అభిమానుల కోసం సోనీ లివ్ బండిల్స్: అందుబాటు ధరతో వీ అందించే రీచార్జ్ ప్యాక్‌లతో  యూఈఎఫ్ఏ యూరో 2024, జింబాబ్వేలో భారత్ టూర్, శ్రీలంకలో భారత్ టూర్ యాక్షన్‌ను ఆస్వాదించండి:

o   రూ. 903 ప్లాన్‌లో సోనీ లివ్ ప్రీమియం మొబైల్‌కు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్, రోజుకు 2 జీబీ డేటా + అపరిమిత కాల్స్‌.

o   రూ. 369 ప్లాన్‌లో సోనీ లివ్ ప్రీమియం మొబైల్‌కు 30 రోజుల సబ్‌స్క్రిప్షన్, రోజుకు 2 జీబీ డేటా + అపరిమిత కాల్స్‌.

o   రూ. 82 ప్లాన్‌లో సోనీ లివ్ ప్రీమియం మొబైల్‌కు 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, 14 రోజుల వేలిడిటీతో 4 జీబీ డేటా.

పోస్ట్‌పెయిడ్:

·         క్రికెట్ అభిమానుల కోసం డేటా యాడ్ ఆన్ ప్యాక్: ప్రపంచంలోనే అతి పెద్ద టీ20 క్రికెట్ టోర్నమెంటును డిస్నీ+ హాట్‌స్టార్‌లో మీ మొబైల్ ఫోన్లలో హెచ్‌డీలో చూడండి. రూ. 499కే వీ యూజర్లు 1 ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా 20 జీబీ డేటా పొందవచ్చు.

·         ఫుట్‌బాల్‌పై మక్కువ గల అభిమానుల కోసం డేటా యాడ్ ఆన్ ప్యాక్: మొత్తం యూఈఎఫ్ఏ యూరో 2024 యాక్షన్‌ను మీ టీవీ/మొబైల్ ఫోన్‌లో చూడండి. నెలకు కేవలం రూ. 100కే వీ యూజర్లు సోనీ లివ్ ప్రీమియం (టీవీ + మొబైల్) సబ్‌స్క్రిప్షన్‌ను ఆస్వాదించడంతో పాటు 10 జీబీ డేటాను పొందవచ్చు.

·         అంతే కాకుండా, నెలకు రూ. 401 నుంచి (జీఎస్‌టీ కాకుండా) ప్రారంభమయ్యే వీ మ్యాక్స్ & ఫ్యామిలీ పోర్ట్‌ఫోలియో కింద డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, సోనీ లివ్ ప్రీమియం మొబైల్ సబ్‌స్క్రిప్షన్లను కూడా ఎంచుకోవడానికి పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అవకాశం ఉంటుంది. వీ మ్యాక్స్ రూ. 701 & రెడ్ఎక్స్ రూ. 1,101 నెలవారీ రెంటల్ ప్లాన్లతో (జీఎస్‌టీ కాకుండా)  డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ (టీవీ +మొబైల్), & సోనీ లివ్ ప్రీమియం (టీవీ+మొబైల్) సబ్‌స్క్రిప్షన్‌ను కూడా వీ అందిస్తోంది.

వీ అందిస్తున్న ఇతర ప్రీపెయిడ్పోస్ట్‌పెయిడ్, ఫ్యామిలీ ప్లాన్లను చూసేందుకుమరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దయచేసి ఈ కింది వాటిని సందర్శించండి:

·         ఓటీటీ ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్స్: https://www.myvi.in/prepaid/best-prepaid-plans

·         మరింత వినోదాన్ని అందించే పోస్ట్-పెయిడ్ ప్లాన్స్: https://www.myvi.in/postpaid/vi-postpaid-plans

Also read : Catch all the sports action this season with Vi Movies & TV App

ఇది కూడా చదవండి :ఐకానిక్ నోకియా లూమియా 920, హెచ్‌ఎమ్‌డి స్కైలైన్ డిజైన్‌తో ఫోన్ ఎంట్రీ వచ్చే నెలలో ప్రారంభం…

ఇది కూడా చదవండి :ఒక్కసారిగా చాలా మందిని తొలగించిన Paytm ఉద్యోగులకు మళ్లీ షాక్

ఇది కూడా చదవండి : దేశంలోని నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు..

ఇది కూడా చదవండి : ఆధార్ కార్డ్ హిస్టరీ ఎలా తెలుసు కోవచ్చు..?

Also read : Muthoot FinCorp Launches ‘Book My Gold Loan’ Campaign with Shah Rukh Khan

error: Content is protected !!