Mon. Oct 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి 14 అక్టోబరు 2023: టీటీడీ కి చెందిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి డిగ్రీ, పిజి కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ సంగీత,నృత్య కళాశాల ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు అక్టోబరు 19వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరిన విద్యార్థులకు హాస్టళ్లలో వసతి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు.ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరడమైనది.

error: Content is protected !!