iscon

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 18,2022: రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

అంతర్జాతీయ ప్రతినిధుల భాగస్వామ్యంతో ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఇస్కాన్ డాక్టర్ సహదేవదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం నుంచి పూజలు, ప్రార్థనలు ప్రారంభమవుతాయి. మళ్ళీ అర్ధరాత్రి ప్రత్యేక మహాభిషేకంతో ఈ వేడుకలు ముగుస్తాయని ఆయన వెల్లడించారు.

శ్రీకృష్ణుడు జన్మదినోత్సవం సందర్భంగా మహా ప్రసాద విందు. సాయంత్రం వేళల్లో భక్తి నృత్యాలు,నాటకాలు, భజనలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.