365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, 2023 అక్టోబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.200/- ప్రత్యేక దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
స్లాట్ల వారీగా గంటకు 200 టికెట్ల చొప్పున రోజుకు దాదాపు 2 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్ చేసుకుని వచ్చే భక్తులను సుపథం ప్రవేశమార్గంలో దర్శనానికి అనుమతిస్తారు.
అనంతరం ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.