365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, నవంబరు 23,2024:తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణీయం సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం 2024 నవంబర్ 23న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు నిరాటకంగా కొనసాగింది, కేధ్యంగా సప్తగిరులు భక్తుల స్తోత్ర సమర్పణతో పులకించాయి.
శ్రీమన్నారాయణీయం 1036 శ్లోకాలతో రూపొందించినది. ఇది కేరళ రాష్ట్రంలో ప్రముఖ ప్రాచీన సుప్రభాతం, తమిళనాడులో కూడా చాలామంది భక్తులు ఈ పారాయణం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా శ్రీమన్నారాయణీయం పారాయణం తిరుమలలో నిర్వహించారు.
దాదాపు 1200 మందికి పైగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, నృసింహ భజన్, హనుమాన్ చాలీసా, జయజనార్దన భజన్, గోవిందనామాలు, రాథేభజన, పంచరత్న స్తోత్రాలను శ్రద్ధతో పారాయణం చేశారు.
ఈ కార్యక్రమానికి టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇలాంటి ప్రాముఖ్యమైన కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదు. దీనిని అంగీకరించి నిర్వహించిన అరుణ, టీటీడీ డిఈ చంద్రశేఖర్ లను అభినందిస్తున్నాను,” అని అన్నారు.
ఆయన ఈ కార్యక్రమం మనకు మానసిక దృఢత్వం కలిగించడంలో ఎంతో ముఖ్యమని, ఇలాంటి సామూహిక పారాయణం మనసు బలమైనది చేయడంలో సహాయపడతుందన్నారు.