365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీశైలం, సెప్టెంబర్16, 2021: శ్రీశైలం జలాశయం 3 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1,43,207 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,35,344 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో అధికారులు గేట్లను పైకెత్తారు. గురువారం 1 గంటల సమయానికి 3గేట్లను అధికారులు ఎత్తారు జలాశయ నీటి మట్టం ఉదయం 1 గంటల సమయానికి నీటి నిల్వ వివరాలు 884.600 అడుగులు, నీటి నిల్వ 213.401 ఎంటీఎంసీలుగా నమోదైంది.
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మొత్తం 1,43,297 క్యూసెక్కుల నీటిని సాగర్ కి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, తుంగభద్ర, నారాయ ణ్ పూర్ జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో దిగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేయడం ఇది మూడో సారి