Mon. Dec 23rd, 2024
SriTirupatamma-Gopaiah-Swamy-Kalyana-Mahotsavam365

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, ఫిబ్రవరి 7,2023: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని16వ డివిజన్ దంసలాపురంలో శ్రీతిరుపతమ్మ – గోపయ్య స్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

దేవస్థాన వ్యవస్థాపకులు కీ”శే కణతాల అచ్చయ్య స్వామి వారి కుమారుడు కణతాల నరసింహరావు ఆధ్వర్యంలో స్వామివార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు కల్యాణ మహోత్సవంలో పాల్గొని తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

SriTirupatamma-Gopaiah-Swamy-Kalyana-Mahotsavam365

అనంతరం పురోహితుల నుంచి ఆశీర్వాచనాలు తీసుకున్నారు. ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఖమ్మం నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కల్యాణం తిలకించారు.

ఈసందర్భంగా భక్తులకు దాతల సహకారంతో దేవస్థానం నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు , బండారు నర్సయ్య, పొన్నం పుల్లయ్య, మండదపు బ్రహ్మారెడ్డి, మందడపు ప్రసాద రెడ్డి, సత్యాల మధు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

error: Content is protected !!