365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 24, 2021: శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సోమవారం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమి నాడు జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు.ఈ కార్యక్రమంలో శ్రీ విఖనస మహర్షి ట్రస్టు సెక్రెటరీ శ్రీ ప్రభాకర్ ఆచార్యులు, ఇతర ఆలయాధికారులు పాల్గొన్నారు.