Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 26, 2024: కాలేయ సమస్యల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రారంభించారు.

నానక్‌రామ్‌గూడాలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపొందించిన ఈ సంస్థకు తన అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో ఇలాంటి ప్రతిష్టాత్మక లివర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. లివర్ అనేది మన శరీరానికి అత్యంత ముఖ్యమైన అవయవం. ఈ ఇన్‌స్టిట్యూట్ సమర్పించే ఆధునిక వైద్యసేవలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురాగలవు. డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి బృందం చేసిన ఈ గొప్ప కృషికి నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ప్రజలకు అత్యాధునిక కాలేయ సంరక్షణ సేవలు,ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలను అందించడానికి సమగ్ర సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ఆహ్వానం పలికిన ఇన్‌స్టిట్యూట్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్, డైరెక్టర్ డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గుడపాటి తదితరులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రముఖులు, అతిథులు ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించి, ప్రసంసలు కురిపించారు.

error: Content is protected !!