365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 23,2025: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు,ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి.
Read this also…Read this also…SF Plastics Files DRHP for Rs.550 Crore IPO
ఇది కూడా చదవండి…బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరోస్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువతకు శిక్షణ
Read this also…Boeing and Learning Links Foundation Empower Andhra Pradesh Students for Aerospace Careers
ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.
తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు మరియు మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.

బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది.
పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్,లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.
Read this also…Boeing and Learning Links Foundation Empower Andhra Pradesh Students for Aerospace Careers
2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది.
ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.