పీడియాట్రిక్ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశాకిరణం..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 26,2025: సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్స్ (సెయింట్ జూడ్స్) హైదరాబాద్‌లో తన పరిధిని విస్తరించుకుంది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలకు సురక్షితమైన, పరిశుభ్రమైన వసతి కల్పించడమే లక్ష్యంగా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.
యాక్సిస్ బ్యాంక్ సెంటర్..
ఈ సెంటర్ ప్రతి పిల్లవాడి క్యాన్సర్ చికిత్స విజయవంతంగా జరగడానికి అవసరమైన వసతి, రవాణా, విద్య, కౌన్సెలింగ్ వంటి ముఖ్యమైన సేవలను అందిస్తోంది. ఈ కేంద్రంలో 26 కుటుంబాలకు ఉచిత వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించబడుతుంది. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) చికిత్స తీసుకుంటున్న పిల్లల కోసం ప్రత్యేకంగా నాలుగు యూనిట్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని MNJ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, రెయిన్‌బో హాస్పిటల్, LV ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లలకు ఈ వసతి ఉపయోగపడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి వచ్చిన కుటుంబాలకు ఇది దోహదపడుతోంది.
సెయింట్ జూడ్ సీఈఓ అనిల్ నాయర్ మామాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంతాల నుంచి క్యాన్సర్ చికిత్స కోసం పెద్ద నగరాలకు వచ్చిన నిరుపేద కుటుంబాలకు సెయింట్ జూడ్స్ ఆశాజనకమైన వసతి కల్పిస్తోంది. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పిల్లలకు కావలసిన అదనపు సాయం అందించి, క్యాన్సర్‌తో పోరాడటానికి మరింత బలాన్నిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న మా సెంటర్, ఇప్పుడు కొత్త సదుపాయాలతో మరింత మందిని ఆదుకునే అవకాశం కల్పిస్తోంది” అని అన్నారు.
సెయింట్ జూడ్స్..
2006లో స్థాపించిన సెయింట్ జూడ్స్, టాటా మెమోరియల్ హాస్పిటల్, ఎయిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రులతో భాగస్వామ్యం ద్వారా పనిచేస్తోంది. 11 నగరాల్లో 45 కేంద్రాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ, క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పనిచేస్తోంది.మరింత సమాచారం కోసం..వెబ్‌సైట్ : www.stjudechild.org చూడవచ్చు.