Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 28, 2024: భారతదేశంలోని అతిపెద్ద స్టాండెలోన్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థగా పేరుగాంచిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించింది.

దాదాపు 100 శాఖలు, 76,000 పైగా ఏజెంట్లు, 8.17 లక్షల మంది కస్టమర్లకు బీమా సేవలు అందిస్తూ, 1,350 మంది ఉద్యోగులతో సంస్థ ఈ రెండు రాష్ట్రాల్లో తన స్థానాన్ని మరింత బలపరచుకుంది.

గత 5 ఏళ్లలో ఈ రెండు రాష్ట్రాల్లో రూ. 3,330 కోట్ల విలువైన క్లెయిమ్‌లను చెల్లించడం, సంస్థ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దత్తత
‘అందరికీ బీమా’ అనే ఐఆర్‌డీఏఐ లక్ష్యాన్ని ముందుగానే గమనించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దత్తత తీసుకుంది. బీమా అవగాహన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ స్థాయికి చేరుకోవడంతో 4,035 గ్రామాల్లో వేలాది మంది ప్రజలకు బీమా సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించింది.

ఈ క్రమంలోనే, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో “స్టార్ ఆరోగ్య డిజి సేవ” పేరుతో సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టింది.

స్టార్ హెల్త్ సంస్థ, దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే బ్రెయిలీ పాలసీ “స్పెషల్ కేర్ గోల్డ్” ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ 40% లేదా అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.

ఆరోగ్య సమస్యల కోసం ఉచిత టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ వంటి సేవలను ప్రారంభించింది. హోమ్ హెల్త్‌కేర్ సర్వీసులు హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

సంస్థ సేవల ప్రాధాన్యం
2024 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 920 కోట్ల క్లెయిమ్‌లను చెల్లించింది. ప్రతి నిమిషానికి 4 క్లెయిమ్‌ల చొప్పున ఆమోదించడం ద్వారా, రోజుకు రూ. 25 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తోంది.

సంస్థ ప్రారంభం నుంచి మొత్తం 1.1 కోట్ల క్లెయిమ్‌లు, రూ. 52,000 కోట్ల విలువైన క్లెయిమ్‌లను చెల్లించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు సమగ్ర, సరళమైన హెల్త్‌కేర్ బీమా సేవలను అందించడంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుంది. ఈ రెండు రాష్ట్రాల్లో తమ సేవలను మరింత విస్తరించి, సమాజంలో మార్పు తేవడమే సంస్థ లక్ష్యం.

error: Content is protected !!