365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 04, 2020: ఒక ల్యాండ్ మార్క్ అభివృద్ధి రూపంగా, స్టెప్ యాప్ (స్టూడెంట్ టేలంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం అప్లికేషన్) కు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుండి ఇండియా లోని అన్ని ట్రైబల్ స్కూల్స్ కి తమ క్రీడాత్మక విద్యార్జన (గేమిఫైడ్ లెర్నింగ్) యాప్ ఉపయోగించమని అధ్యాదేశం ఇవ్వబడింది.ఇలా మోనిటైజ్డ్ ప్రాజెక్ట్ లో ఒక గవర్నమెంట్ ఇనిస్టిట్యూషన్ ఒక ఎడ్ టెక్ స్టార్టప్ తో టైఅప్ అవటం మొదటి సారి కావటం ఒక ప్రత్యేకత.ఈ ప్రారంభం వల్ల వెంటనే దేశం మొత్తం మీద గ్రేడ్ 1-12 లోని 1.5 లక్షల విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. దీని ద్వారా రాబోయే సంవత్సరాలలో దీని ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయని ఆశించవచ్చు. ఈ అసోసియేషన్ ద్వారా, స్టెప్ యాప్ స్కూలు పరీక్షలు ,కాంపిటీటివ్ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభను మరింతగా పెంపొందించుతుంది. అంతే కాక. డ్యాష్ బోర్డ్స్ ద్వారా విద్యార్థుల విద్యార్జన పరిణామాలను తెలుసుకొనుటకు ఇది స్కూల్స్ కు సామర్థ్యం అందజేస్తుంది. అందజేయబడే విషయాలు ఇంగ్లీషులో ఉంటాయి.స్టెప్ యాప్ విద్యార్థులకు ఒక గేమిఫైడ్ లెర్నింగ్ సొల్యుషన్, దీని గేమిఫైడ్ ఫార్మట్ ద్వారా మ్యాథ్స్ , సైన్స్ లో కాన్సెప్ట్యువల్ క్లారిటీ పొంద వచ్చు, అలాగే దీని ద్వారా లెర్నింగ్ ఒక ఫన్ గా మారి, చదువుకొనుట సరదాగా ఉంటుంది. సులభంగా మార్చే ఒక టెస్టింగ్ మెథడాలజీ, తెలుసుకో దగిన అధ్యయన ఫలితాలు, సెల్ఫ్-పేస్డ్ లెర్నింగ్, 400+ ఐఐటియన్స్ ,డాక్టర్ల ద్వారా సృష్టించబడిన కంటెంట్, ఇంకా రివార్డులు & రికగ్నిషన్ తో సహా మరెన్నో ఫీచర్లు ఇది అందిస్తుంది.ప్రతి విద్యార్థి యొక్క కలల స్ప్రింగ్ బోర్డుగా మారాలన్నది , టెక్నాలజీ,గేమికేషన్,ఉపయోగించుకుని, ఇండియాలోని ప్రతి చైల్డ్ కు క్వాలిటీ విద్యార్జనకు యూనివర్సల్ యాక్సెస్ అందజేసి, మన దేశానికి వైభవ సంపదగా మారే మెరిటోరియస్ చిల్డ్రన్ బ్యాంకును సృష్టించాలన్నది స్టెప్ యాప్ఉద్దేశం.
స్టెప్ యాప్ 31 ఆగస్టు నాటికి 35,167 రిజిస్టర్డ్ స్టూడెంట్స్ తో, 242 స్కూల్స్ లో 21 రాష్ట్రాలు (గుజరాత్ , మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, నాగాలాండ్.వెస్ట్,బెంగాల్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, మణిపూర్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, సిక్కిమ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గర్, ఝార్ఖండ్, మిజోరమ్,కర్నాటక) లో వర్తింప చేయబడినది.ప్రవీణ్ త్యాగి, మేనేజింగ్ డైరెక్టర్, పేస్-ఐఐటి సిఇఒ & ఫౌండర్, ఎడల్స్ ఫన్ టెక్నాలజీస్ (స్టెప్ యాప్) ఇలా అన్నారు, “ఇది భారత ప్రభుత్వం మరియు ట్రైబల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందజేయబడుతున్న ఒక గొప్ప ప్రారంభం. ఈ మహమ్మారి తరుణంలో, విద్యార్జనకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం ఉంది మరియు ఈ విషయంలో సరియైన చర్యలు తీసుకోబడినవి. ఈ ట్రైబల్ పిల్లలకు ఆన్ లైన్,లెర్నింగ్ సొల్యుషన్స్ అందించేలా EMRS స్కూల్స్,టీచర్లకు మేము సామర్థ్యం అందించ గలిగినందుకు, విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విషయంలో వారిని సమర్థులుగా చేసే మా షేర్డ్ విజన్ దిశలో పనిచేయ గలుగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ కష్ట సమయాలలో నేషన్ బిల్డింగ్ కొరకు మేము సహాయపడ కలగటం మాకు గర్వకారణంగా కనిపిస్తున్నది. ”మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఇండియా: “స్టెప్ యాప్ విద్యార్థులకు గేమిఫైడ్ పద్ధతిలో మేథమెటిక్స్,సైన్స్ కాన్సెప్ట్స్ టీచ్ చేయుట ఒక అద్భుతమైన ప్రారంభం, దీని ద్వారా వివిధ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం వారికి సులభంగా, సరదాగా ఉంటుంది. మినిస్ట్రీ తరఫు నుండి కూడా స్టూడెంట్స్ కు ఉన్నత నాణ్యత విద్య అందజేయుట మా పని, vవిద్యార్థులకు విద్యార్జన చాలా ప్రయోజనకారి కావటం విషయంలో అనేక ఇనీషియేటివ్స్ లో స్టెప్ యాప్ ఒకటి. ” ,