365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 9,2022: ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్స్ కు సంబంధించిన ఆటోలు నడపడం చట్టవిరుద్ధమని, మూడు రోజుల్లోగా ఆయా సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక రవాణా శాఖకు యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (UFERWAS) ఫిర్యాదుచేసింది.
బెంగళూరు నగరంలో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఓలా, ఉబర్ ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని రవాణాశాఖను UFERWAS అభ్యర్థించింది. హైదరాబాద్‌లోనూ ఉబర్, ఓలా క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు సర్జ్ ప్రైసింగ్ పెట్టి వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారని UFERWAS ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బిటి శ్రీనివాసన్ అన్నారు.
వారి స్కామ్‌ను ఆపడానికి వారి సేవలను కనీసం ఒక వారం పాటు నిలిపివేయాలని, అందుకోసం నోటీసులు జారీ చేయాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది.