Sat. Nov 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 21,2021: స్టోరీటెల్… ఇప్పుడు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్న మాధ్యమం. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన స్టోరీటెల్ గతేడాది‘సెలెక్ట్’అనేప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా చందాదారులు 11 ప్రాంతీయ భాషలలో కంటెంట్ ఎంచుకోవచ్చు. గతంలో స్టోరీటెల్‌ సెలెక్ట్‌ వార్షిక చందా రూ.1198 ఉండేది. కానీ ఇప్పుడు చందాదారుల సౌలభ్యం కోసం వార్షిక చందాని బాగా తగ్గించి… ఏడాదికి రూ.399గా మార్చారు. ఈ తగ్గింపుతో… గతంలో పొందిన 11 ప్రాంతీయ భాషలలోని కథలను ఇప్పుడు కూడా పొందవచ్చు. దీనిద్వారా చందాదారులకు మరిన్ని కథలను అందిస్తూ వారి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటుంది స్టోరీటెల్‌.

    రూ .399ల వార్షిక చందాతో ఏడాది మొత్తం యాక్సెస్ ఇవ్వడం వినియోగదారులు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, ఈ యాప్ 2 లక్షల కంటే ఎక్కువ పుస్తకాలను హోస్ట్ చేస్తోంది. అంతేకాకుండా ప్రతి వారం మరిన్ని టైటిల్స్ యాడ్‌ అవుతున్నాయి. స్టోరీటెల్‌ని మరింత మంది శ్రోతలకు అందుబాటులో ఉండేలా చెయ్యాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గించారు. “ఆడియో బుక్స్‌కి మార్కెట్‌లో రోజురోజుకి డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే ఆడియో బుక్స్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా వినియోగదారుల్లో రోజురోజుకి పెరుగుతోంది.

11 ప్రాంతీయ భాషల్లోని కథలను అన్‌లిమిటెడ్‌ యాక్సెస్‌తో తక్కువ వార్షిక చందాతో అందించడం వెనుక ఉన్న మా ఉద్దేశ్యం ఒక్కటే. కథలను పాకెట్ ప్రెండ్లీగా మార్చడమే. వినియోగదారులు ఎల్లప్పుడూ కొత్త తరహా వినోదాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. అనుకూలమైన ధర వద్ద కొనుగోలుచేయాలనే ఆసక్తి కలుగుతుంది. ప్రతిఒక్కరికీ కథలను అందుబాటులోకి తీసుకురావడమే స్టోరీటెల్ లక్ష్యం. సబ్‌స్క్రిప్షన్ చందా రూ.399కు తగ్గించటం ద్వారా కథలు వినే అలవాటు అందరిలో పెరగాలని ఆశిస్తున్నట్టు స్టోరీటెల్ ఇండియా కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్ అన్నారు. 

చందా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:– https://www.storytel.com/in/en/subscriptions#pricePlans

స్టోరీటెల్ ఆడియోబుక్ ఈ-బుక్ యాప్ స్ట్రీమింగ్ సర్వీస్. నవంబర్ 27, 2017న భారతదేశంలో ప్రారంభించబడింది. కంపెనీ ప్రధాన కార్యాలయం స్టాక్‌హోమ్, స్వీడన్ లో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 మార్కెట్లలో చలామణిలో ఉంది. భారత దేశంలో ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ,బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగు, అస్సామీ, గుజరాతీ మరియు కన్నడ మొత్తం 12 భాషలలో 2 లక్షలకు పైచిలుకు ఆడియోబుక్‌, ఈ-బుక్  ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా  గొప్ప కథలను ఆస్వాదించటానికి, ఆ కథా ప్రపంచంతో మరింత సాన్నిహిత్యం పెంచుకోటానికి ప్రధాన స్రవంతిగా మారటమే స్టోరీటెల్ ముఖ్య లక్ష్యం.అందుబాటు: స్టోరీటెల్‌ ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌లో http://bit.ly/2rriZaUఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లో https://apple.co/2zUcGkG లింకులలో  అందుబాటులో ఉంది.

error: Content is protected !!