365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చెన్నై, డిసెంబర్ 8, 2025: డైమ్లర్ ట్రక్ AG అనుబంధ సంస్థ అయిన డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ (DICV), దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్‌పట్టణ ప్రయాణీకుల రవాణా విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా మెరుగుపరిచిన హెవీ డ్యూటీ బస్ ఛాసిస్ BB1924ను ఈరోజు ప్రవేశపెట్టింది.

గ్రాస్ వెహికిల్ వెయిట్ (GVW) 19,500 కేజీలు (19.5 టన్నులు)గా ఉన్న ఈ BB1924, అధిక పేలోడ్ సామర్థ్యం, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యం,తక్కువ నిర్వహణ ఖర్చులను కోరుకునే ఆపరేటర్ల కీలక అవసరాలను తీర్చడానికి రూపొందించింది. భారతదేశ బస్సు మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త ఛాసిస్ ప్రధాన అంతర్‌పట్టణ విభాగంలో భారత్‌బెంజ్‌కు మరింత వాటాను సంపాదించి పెట్టనుంది.

తక్కువ నిర్వహణ వ్యయం (TCO)పై దృష్టి
DICV, ఈ కొత్త BB1924 బస్సు ద్వారా అంతర్‌పట్టణ రవాణాలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని తెలిపింది. “అధునాతన భద్రతా అంశాలు, పరిశ్రమలో అగ్రగామి స్థానికీకరణ (92% మేర),యజమానత్వ మొత్తం ఖర్చు (TCO)పై దృష్టి పెట్టడం ద్వారా భారత్‌బెంజ్ అంతర్‌పట్టణ చలనశీలతలో విలువ ,విశ్వసనీయతకు ప్రమాణాలను నెలకొల్పుతోంది,” అని DICV బస్ బిజినెస్ హెడ్ ఆండముత్తు పొన్నుసామి అన్నారు.

ముంబై-పూణె, ఢిల్లీ-జైపూర్, చెన్నై-బెంగళూరు వంటి ప్రధాన మార్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి పరీక్షల్లో, ఇప్పటికే ఉన్న వాహనాలతో పోలిస్తే BB1924 యజమానుల మొత్తం వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్టు తేలింది.

రాజీలేని భద్రత, సమగ్ర మద్దతు
ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, BB1924లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (EVSC),5-దశల నియంత్రణా వ్యవస్థతో కూడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రిటార్డర్ వంటి అధునాతన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అధిక తన్యత కలిగిన స్టీల్ ఛాసిస్‌తో పాటు, ఫ్యాక్టరీలో బిగించిన మిషెలిన్ రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్లు మెరుగైన మన్నికను అందిస్తాయి.

ఆపరేటర్ల కోసం మద్దతు:

నెట్‌వర్క్: దేశవ్యాప్తంగా 398 భారత్‌బెంజ్ అధీకృత టచ్‌పాయింట్లలో లభ్యం.

ఫైనాన్సింగ్: HDFC, ICICI, బజాజ్ ఫిన్‌సెర్వ్‌తో సహా 15కు పైగా బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యం. వార్షిక వడ్డీ రేటు 8.5% నుండి ప్రారంభమవుతుంది.

వారంటీ: 6 సంవత్సరాలు లేదా 6 లక్షల కిలోమీటర్ల సమగ్ర పవర్‌ట్రెయిన్ వారంటీ.

సర్వీస్: 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 24/48 గంటల్లో 95% విడిభాగాల లభ్యత హామీ.

సాంకేతిక వివరాల సమీక్ష..
BB1924లో BS-VI OBD-II OM926, 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 241 హార్స్‌పవర్ శక్తిని,850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ సింక్రోమెష్ గేర్‌బాక్స్ హైవే సామర్థ్యాన్ని పెంచుతుంది.

సస్పెన్షన్: ముందు & వెనుక న్యుమాటిక్ సస్పెన్షన్.

మైలేజ్: 380 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో 1,300+ కిమీ పరిధి.

సేవా జీవితం: 10-15 ఏళ్ల సేవా జీవితానికి అనుగుణంగా రూపుదిద్దబడింది.

సర్వీస్ వ్యవధి: 1వ సర్వీస్ 60,000 కిమీ వద్ద, ఆ తర్వాత ప్రతి 1,20,000 కిమీలకు.