Mon. Dec 23rd, 2024
the Style Story Exhibitions
the Style Story Exhibitions

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 8,2022: దస్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్స్ వారు ఏటా నిర్వహించే లగ్జరీ వెడ్డింగ్, ప్యాషన్ ఎగ్జిబిషన్ 21వ ఎడిషన్ రేపటి నుంచి రెండురోజులపాటు అంటే ఆదివారం10 జూలై వరకూ జరగనున్నది. రెండు రోజుల పాటూ నిర్వ హించే ఈ ఎగ్జిబిషన్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో నిర్వ హిస్తున్నారు. నిర్వాహకులు ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్క రించారు. ఫ్యాషన్ డిజైనర్లు, మోడళ్లు, స్టాల్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించ బోయే ఎగ్జిబిషన్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

the-expo

ది స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్స్ నిర్వాహకురాలు కుమారి సుచరిత మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచివచ్చి 35మందికి పైగా డిజైనర్లు తమ తమ వస్త్రాలను ప్రదర్శించ నున్నట్లు వివరించారు. వీరు రాబోయే వివాహ, పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రత్యేక డిజైన్లను అందించనున్నారని తెలిపారు. దీంతో పాటూ లేటెస్ట్ ట్రెండ్స్ ను అనుసరిస్తూ రూపొందించిన పలు రకములైన వస్త్రాలు, అలంకరణ సామగ్రి, వజ్రాభరణాలతో పాటూ వెడ్డింగ్ మరియు ఫెస్టివల్ సీజన్ కు అవసరమైన ఇతర వస్తువులు ఎగ్జిబిషన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని వివరించారు.

ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మనోజ్ పట్వర్థన్ మాట్లాడుతూ ఒక వైపు షాపింగ్ కు సంబంధించిన స్టాల్స్ తో పాటూ హైదరాబాదుకు చెందిన ప్రత్యేక వంటకాలు , స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈ వారాంతంలో షాపింగ్ తో పాటూ మంచి టేస్టీ ఫుడ్ ను కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఎక్స్ పోలో ఫ్యామిలీ మొత్తం వారాంతాన్ని ఆహ్లాదకరంగా గడుపవచ్చని చెప్పారు.

the Style Story Exhibitions

ఈ సందర్భంగా తన నూతన వెడ్డింగ్ కలెక్షన్ ను ప్రదర్శిస్తున్నట్లు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సోనియా పున్వాని తెలియజేశారు. కోవిడ్ తర్వాత మరళా అందరిలో ప్యాషన్ పట్ల ఆసక్తి పెరుగుతోందని అంటూ తన లాంటి ఎందరో ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొంటున్న ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించాలని సూచించారు. అనంతరం ప్రముఖ మాడల్ డెబ్రా మాట్లాడుతూ గతంలో ఇలాంటి ఎన్నో ఎగ్జిబిషన్స్ ద్వారా ఎందరో ఔత్సాహికులైన మాడళ్లకు, ప్యాషన్ డిజైనర్లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ రంగంలో మళ్లీ అవకాశాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

the-expo

అహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబమంతా ఉల్లాసంగా గడుపుతూ షాపింగ్ కూడా చేయడానికి వీలు కలిపించే ఈ ప్రదర్శనను హైదరాబాదు వాసులు పెద్ద ఎత్తున సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్స్ నిర్వాహకులు మనోజ్ పట్వర్థన్, కుమారి సుచరిత, ప్రముఖ ప్యాషన్ డిజైనర్ సోనియా పున్వాని, మోడల్ డెబ్రితో పాటు స్టాల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

error: Content is protected !!