Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 23, 2023:రెండు రోజుల లాభాలకు తెరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

యూరోజోన్ పీఎఐం డేటా నిరుత్సాహంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫియర్ ఇండెక్స్ నిఫ్టీ విక్స్ 4 శాతం మేర తగ్గడం ఊరటనిస్తోంది.

బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ 5, నిఫ్టీ 9 పాయింట్ల మేర కుంగాయి. సూచీలు సపోర్టు, రెసిస్టెన్సీ జోన్లోనే కదలాడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 83.34 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 66,023 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 66,084 వద్ద మొదలైంది. వెంటనే రోజువారీ గరిష్ఠమైన 66,235ను తాకింది. క్రమంగా పతనమవుతూ 65,980 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది.

చివరికి 5 పాయింట్ల నష్టంతో 66,017 వద్ద ముగిసింది. గురువారం 19,828 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 19,875ను తాకింది. 19,786 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది.

మొత్తంగా 9 పాయింట్లు పతనమై 19,802 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 127 పాయింట్లు ఎగిసి 43,577 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 25 కంపెనీలు లాభపడగా 25 నష్టపోయాయి. హీరో మోటో, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐచర్ మోటార్స్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సిప్లా, అల్ట్రాటెక్ సెమ్, ఎస్బీఐ లైఫ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎల్‌టీ టాప్ లాసర్స్.

నేడు ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.

నేడు నిఫ్టీ పతనమవ్వడంలో సిప్లా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ దానిని అడ్డుకుంది.

నిఫ్టీ50 నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,950 వద్ద రెసిస్టెన్సీ, 19,800 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వె్స్టర్లు స్వల్ప కాలానికి భారతీ ఎయిర్టెల్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనొచ్చు.

చక్కెర షేర్లు గురువారం తీపి పంచాయి. దాల్మియా భారత్, శ్రీ రేణుక, బజాజ్ హిందుస్థాన్, బలరాంపుర్ మిల్స్ 2 నుంచి 10 శాతం వరకు పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్, ఇంజినీర్స్ ఇండియాలో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకుంది.

యూఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ జారీచేయడంతో సిప్లా షేర్లు 7 శాతం మేర పతనమయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల వల్ల బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల క్రెడిట్ గ్రోత్‌పై ప్రభావం ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.

ఎస్ఈపీసీలో ఎస్బీఐ 2.18 శాతం వాటా అమ్మేసింది. సుజ్లాన్ ఎనర్జీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు 7 శాతం పతనమయ్యాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!